FEST: వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు స్వర్ణ రథోత్సవం తిరువీధుల్లో వేడుకగా సాగింది. మలయప్పస్వామి స్వర్ణరథంపై ఆసీనులై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో వాహనసేవలో పాల్గొని స్వర్ణరథాన్ని లాగారు.
ఇటు విజయవాడ ఇంద్రకీలాద్రి పై దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు అభయమిస్తున్నారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలో బారులు తీరారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ దేవి కాళరాత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్లు ఉత్సవ మూర్తుల గజవాహనంపై కొలువుతీరగా అర్చకులు విశేష పూజుల చేశారు. కళాకారులు సందడి నడుమ శ్రీస్వామి అమ్మవార్లకు శ్రీగిరి పురవీధుల్లో రమణీయంగా గ్రామోత్సవం జరిగింది. మహోత్సవాల్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. సాయంత్రం మహాదుర్గా అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమివ్వనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com