వంశీ అరాచకాలను ఇప్పటికైనా ఆపాలి : దుట్టా వర్గం

గన్నవరం వైసీపీలో వర్గ విబేధాలు మళ్లీ భగ్గుమన్నాయి.. ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా మరోసారి దుట్టావర్గం ఆందోళనకు దిగింది. వంశీ అరాచకాలను ఇప్పటికైనా ఆపాలి అంటూ నినాదాలు చేశారు. బాపులపాడు MPDO కార్యాలయం వద్ద YCP నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.. కాకులపాడు YCP నేత సూరపనేని రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గ్రామసచివాలయం, ఆర్బీకే సెంటర్ భూమిపూజ సందర్భంగా వంశీ వర్గం.. దుట్టా వర్గాల మధ్య ఈ వివాదం తలెత్తింది. టీడీపీ నుంచి వచ్చిన వంశీ అనుచరులకు భూమి పూజ బాధ్యతలు అప్పగించడపై ఆందోళన చేపట్టారు.. బీసీ, ఎస్సీ లపై వంశీ అరచాకాలు ఆపాలని.. సీఎం జగన్ కలుగజేసుకుని పార్టీ కార్యకర్తలను కాపాడాలని నినాదాలు చేశారు. తరువాత అంబేద్కర్ విగ్రహానికి, MPDOలకు వినతి పత్రం అందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com