Duvvada Railway Station: రైలు దిగుతూ పట్టు తప్పి ప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కుని..

Duvvada Railway Station: అదృష్టం బావుంది.. ట్రైన్ ఆగింది. లేకపోతే ఓ విద్యార్థిని ప్రాణం గాల్లో కలిసిపోయేది. విశాఖపట్నం దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఓ యువతి నరకయాతన అనుభవించింది. రైలుప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కుని దాదాపు గంటన్నరపాటు ఇబ్బంది పడింది.
అన్నవరంకు చెందిన శశికళ (20) దువ్వాడలోని ఓ కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీకి వెళ్లేందుకు గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ ఎక్కి దువ్వాడ చేరుకుంది. రైలు దిగే క్రమంలో రైలు-ప్లాట్‌ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయింది.
ఆమె కాలు పట్టాల మధ్య ఉండిపోవడంతో గగ్గోలు పెట్టింది. దీంతో రైల్వే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతి ఇరుక్కున్న చోట ప్లాట్‌ఫామ్ కట్ చేశారు. దాదాపు గంటన్నరపాటు శ్రమించి ఆమెను బయటకు తీసి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనతో రైలు గంటన్నర ఆలస్యంగా బయలుదేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com