Balineni Srinivasa Reddy : నేడే ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూత్‌లకు మాక్ పోలింగ్
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూతులకు ఇవాళ మాక్ పోలింగ్, రీ చెకింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలపై అనుమానాలను వ్యక్తం చేస్తూ రీ కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘానికి వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దరఖాస్తు చేశారు. టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రక్రియ ప్రకారం మాక్ పోలింగ్, రీ చెకింగ్ చేసేందుకు ఈసీ సిద్ధమైంది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలలోని ఫలితాల డేటాతో వీవీ ప్యాట్ స్లిప్పులు సరిచేయాలే తప్ప మాక్ పోలింగ్, రీ చెకింగ్ అవసరం లేదని ఏపీ హైకోర్టును బాలినేని ఆశ్రయించారు.
కాగా, ఇవాళ ఉదయం 10:40 గంటలకు ఏపీ హైకోర్టులో బాలినేని శ్రీనివాస్ రెడ్డి రిట్ కేసు హియరింగ్ కు రానుంది. ఉన్నత న్యాయస్థానం ఏం ఆదేశాలు ఇస్తుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. కోర్టు ఆదేశాలు వచ్చే వరకు యధావిధిగా కొనసాగనున్న ఎన్నికల సంఘం టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్.. కాగా, ఒంగోలు నియోజకవర్గంలోని 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను ఈసీ అధికారులు పరిశీలించనున్నారు. అ
బాలినేని ఈవీఎంలపై వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ తమీమ్ ఆన్సారియా సిద్దమవుతున్నారు. రీ మాక్ పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రీ మాక్ పోలింగ్ నిర్వహన తీరుపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ హైదరాబాద్ లో ట్రైనింగ్ పొందారు. ఇప్పటికే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన 26మంది అభ్యర్థులకు కలెక్టర్ తమీమ్ ఆన్సారియా సమాచారం అందించారు. రోజుకు మూడు ఈవీఎంల చొప్పున నాలుగు రోజులపాటు రీ మాక్ పోలింగ్ ప్రక్రియను జరగనుంది. ఈ ప్రక్రియను భూసేకరణ విభాగపు ప్రత్యేక కలెక్టర్ ఝాన్సీలక్ష్మీ పర్యవేక్షించనున్నారు. మరోవైపు ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరా నిఘాలో చేపట్టనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com