ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకి రిలీఫ్..!

ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకి రిలీఫ్..!
ఎంపీ రేవంత్ రెడ్డి పై ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏసీబీ చార్జ్ షీట్ ఆధారంగా రేవంత్ పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.

ఎంపీ రేవంత్ రెడ్డి పై ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏసీబీ చార్జ్ షీట్ ఆధారంగా రేవంత్ పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఎమ్మెల్యే స్టీఫన్ సన్ కు ఎంపీ రేవంత్ రెడ్డి.. 50 లక్షల రూపాయలు ఇచ్చినట్లు చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసే విధంగా ఎమ్మెల్యే స్టీఫన్ సన్ తో రేవంత్ రెడ్డి రాయభారం నడిపించారని వెల్లడించారు. టీడీపీ అభ్యర్ధిగా వేం నరేందర్ రెడ్డికి ఓటు వేయాల్సిందిగా స్టీఫన్ సన్ ను ప్రలోభాలకి గురిచేశారని ఏసీబీ అభియోగం మోపింది. ఈడీ చార్జ్ షీట్ లో ప్రధాన నిందితుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని పేర్కొంది. మరోవైపు ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకి రిలీఫ్ లభించినట్టుగా తెలుస్తోంది. ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో చంద్రబాబు పేరు లేదు. అలాగే గతంలో ఏసీబీ దాఖలు చేసిన చార్జ్ షీట్ ఆధారంగానే ఈడీ ఈ చార్జ్ షీట్ దాఖలు చేసింది. దీనితో ఈ కేసులో ఆయనకీ ఉరట లభించిందనే అంటున్నారు న్యాయనిపుణులు.



Tags

Read MoreRead Less
Next Story