Editorial: నెల్లూరు జనసేనలో తారాస్థాయికి వర్గపోరు

Editorial: నెల్లూరు జనసేనలో తారాస్థాయికి వర్గపోరు
తారాస్థాయికి నెల్లూరు జనసేన లీడర్ల ఫైటింగు - అధినేత పవన్ కల్యాణ్ నుంచి పిలుపు; పీక్స్ కు చేరిన వినోద్, మనుక్రాంత్ రెడ్డిల పంచాయితీ; వినోద్ రెడ్డి సస్పెన్షన్ తో షేక్ అయిన సిటీ; జనసైనికుల అలజడితో సాయంత్రానికే నిర్ణయం వెనక్కి....






రాష్ట్రం మెత్తం మీద జిల్లాకో అసెంబ్లీ స్థానంలో జనసేన కాస్తోకూస్తో బలంగా ఉందంటే అది నెల్లూరు సిటీలొనే. ఇదే.. ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలకు కారణంగా మారిందంటున్నారు నెల్లూరు జిల్లా జన సైనికులు. నెల్లూరు నగరంలోని జనసేన నాయకుల మధ్య అసలెందుకు ఇంత గ్యాపొచ్చింది. 2019లో నెల్లూరు నగరం నుండి కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచాడు. హోరాహోరీ త్రిముఖ పోరులో వినోద్ రెడ్డి ఓడిపోయాడు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రభుత్వ ప్రజా వ్యతికేక విధానాలను ఎండగడుతూ... ఎదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉంటు వస్తున్నాడట. గడపగడపకు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టక మునుపే.. గత 275 రోజులుగా పవనన్న ప్రజాబాట పేరుతో నెల్లూరు నగరంలోని ప్రతిఇంటి గడప తొక్కుతున్నాడట వినోద్ రెడ్డి. దీంతో నెల్లూరు నగరంలో జనసేనకు మంచి మైలేజ్ రావడంతో పాటు.. ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందట. ప్రచారంలో ఉన్నట్టు.. ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్న జనసేనని పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో జతకడితే నెల్లూరు నగరం నుండి బరిలోకి దిగాలన్నది కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆలోచనగా తెలుస్తుంది. అయితే ఇక్కడే నెల్లూరు జనసేనలో వర్గ విభేదాలు తెరలేచాయట.

నెల్లూరు జనసేన అధ్యక్షుడిగా ఉన్న మనుక్రాంత్ రెడ్డి గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుండి పోటీచేసి ఓడిపోయాడు. దీంతో ఈసారి తన అదృష్టాన్ని నెల్లూరు నగరం నుండి పరిక్షించుకోవాలని తహతహలాడుతున్నాడట. కొంత కాలంగా నెల్లూరు నగరం మీద దృష్టి సారించి వినోద్ రెడ్డికి ప్యార్లల్ గా కార్యక్రమాలు చేపడుతన్నాడట. అంతేకాదు నెల్లూరు నగరానికి అధ్యక్షుడిగా సుజయ్ అనే యువకుడిని నియమించడం కూడా జరిగిపోయిందట. ఇదంతా అధిష్టానం ఆదేశాలతోనే జరిగిదంటోంది మనుక్రాంత్ రెడ్డి వర్గం. ఏ బాధ్యత, పదవిలేని వినోద్ రెడ్డి అసలు నెల్లూరు నగర అభ్యర్థి ఎలా అవుతాడన్న ప్రశ్న లేవనెత్తుతున్నారు. 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందినా పార్టీని అంటి పెట్టుకుని పార్టీ కార్యక్రమాలు చేపడుతున్న తానెందుకు జనసైనికుడిని కాకపోతానంటూ ఎదురు ప్రశ్నిస్తున్నాడట వినోద్ రెడ్డి.

ఇలా ఎవరికి వారు నెల్లూరు నగరంలో ప్రచారం చేసుకుంటూ ఎదురు పడితె యుద్ధ వాతావరణం, సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం నడుస్తోందట. రాజకీయ ప్రత్యర్థులను తలపిస్తూ జనసేనలోని మనుక్రాంత్, కేతంరెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందట. వెంకటేశ్వరపురం ప్రాంతంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమంలొ వినోద్ రెడ్డి ఇంటింటికి అంటించిన పవన్ కళ్యాణ్ బొమ్మపై.... మనుక్రాంత్ రెడ్డి బొమ్మలను ఆయన వర్గం అంటించడంతో మాటల యుద్ధం చెలరేగి పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు చేరిందట. వినోద్ రెడ్డి వర్గం కేసులు నమోదు చేయించడం, అది ఎఫ్ఐఆర్ కావడంతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడంటూ వినోద్ రెడ్డిపై అభియోగం మోపి పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేశాడు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి. దీంతొ ఒక్కసారిగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నా జనసైనికులు సోషల్ మీడియా వేదికగా మనుక్రాంత్ రెడ్డి పై విమర్శలకు దిగారట. జనసేన అఫిషియల్ సైట్లలో సైతం మనుక్రాంత్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించడం, మీడియాలో కథనాలు రావడంతొ ఒక్కసారిగా అధిష్టానం స్పందించినట్టు తెలుస్తుంది. దీంతొ సాయంత్రానికి కేతంరెడ్డి వినోద్ రెడ్డి సస్పెన్షన్ను రద్దు చేస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడిగా మరో ప్రకటన విడుదల చేశాడు మనుక్రాంత్ రెడ్డి.

అయితే ఇప్పుడు వినోద్ రెడ్డి పై తీసుకున్న సస్సెండ్ నిర్ణయం అధిష్టానంకు తెలిసి తీసుకున్నాడా.. లేక మనుక్రాంత్ రెడ్డి సొంత నిర్ణయమా అన్నది తెలియాల్సిన విషయం. నెల్లూరు నగర బరిలో నిలవాలన్న ఆలోచనతోనే మనుక్రాంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకన్నాడన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. విషయం తెలుసుకున్న అధిష్టానం వినోద్ రెడ్డి సస్పెన్షన్ రద్దు చేయించిందని జిల్లాలో జనసైనికులు చర్చించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఇంతకాలం పట్టించుకోని జనసేన అధిష్టానం ఇప్పుడు నష్టనివారణ చర్యలకు సమాయత్తం అయిందట. మనుక్రాంత్ రెడ్డిని, వినోద్ రెడ్డిలకు పిలుపొచ్చినట్టు తెలుస్తుంది. నేడోరేపో ఇద్దరు నేతలు జనసేన అధిష్టానం ముందుక హాజరు అవుతారాట. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్వయంగా తెప్పించుకుందట జనసేన అధిష్టానం. ఇరువురిని కూర్చోబెట్టి ఏం జరిగింది.. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందన్న విషయంపై చర్చించే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఎవరి బాధ్యతలు వారికి అప్పగిస్తే మరోసారి ఇలాంటి వివాదం రాకుండా ఉంటుందంటున్నారట నెల్లూరు జనసైనికులు. మరి జనసేన అధిష్టానం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story