Editorial: "ఆనం, కోటంరెడ్డిల సస్పెన్స్ కు కారణమేంటి?"

Editorial: ఆనం, కోటంరెడ్డిల సస్పెన్స్ కు కారణమేంటి?
హాట్ టాపిక్ గా ఆనం, కోటంరెడ్డి; తిరుగుబావుటా ఎగరేసి ఒక్కసారిగా మౌనం; ఇరువురి కలయికలపై అధిష్టానం నిఘా; నేతల వ్యూహం ఏంటన్న దానిపై తీవ్ర ఉత్కంఠ; బడ్టెట్ సమావేశాల తర్వాతే బాంబులు పేలనున్నాయా?



రాజకీయాల్లో ఎత్తులు వేయడం.. ప్రత్యర్థి వ్యూహాలను తిప్పికొట్టడం నెల్లూరు నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. వారి ఎత్తులను చిత్తు చేయడం అసాధ్యమంటారు తలపండిన రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు అదే పనిలో ఉందట వైసీపీ అధిష్టానం. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి...వైసీపీ రాష్ట్ర నాయకత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన నేతలు. అయితే సంచలన ప్రకటనలు, నిర్ణయాల తరువాత ఇరువురు నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు. వారి వ్యూహాలేంటి. ఎటువంటి ఎత్తుగడలు వేస్తున్నారన్న దానిపై పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట.

ఇటు ఇంటలిజెన్స్, అటు జిల్లా పార్టీ నాయకత్వం వీరి నెక్ట్స్ స్టెప్ ఏంటన్న దానిపై జుట్టు పీక్కుంటోందట. కోటంరెడ్డి, ఆనం ఏం చేయబోతున్నారు అన్నదానిపై ఎప్పటికప్పుడు ఫాలోప్ చేసుకుంటూ.. వారి పరిస్థితిని ఆరా తీస్తుందట వైసీపీ అధిస్టానం. రాష్ట్రంలో వైసీపీపై నెలకొన్న వ్యతిరేకతతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే టీడీపీలోకి వలసల ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాల్లోనూ టీడీపీ నాయకులు పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వాస్తవానికి ఆనం, కోటంరెడ్డిల కంటే ఆలస్యంగా బీజేపీపై అసంతృప్తి గళం వినిపించిన కన్నా.. టీడీపీ తీర్థం పుచ్చుకుని రాష్ట్రస్థాయి నేతలకు ఆదర్శంగా నిలిచాడు. సంచలనాలకు కేంద్రంగా ఉన్నా నెల్లూరు నుండి ఆనం, కోటంరెడ్డి ఎందుకు ఇంకా నిర్ణాయాలు తీసుకోలేదన్న దానిపై రాష్ట్రంలో చర్చ నడుస్తోందట. జిల్లాలో అయితే ఇరువురు నేతలపై పందాలు కూడా జోరందుకున్నాయట.

ఇద్దరు నేతలు అసలు ఎందుకు వైసీపీపై తిరుగుబావావుటా ఎగుర వేసి సైలెంట్ గా ఉన్నారు. వీరి ప్రశాంతత వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా. రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి. వీరి రాజకీయ అడుగు ఎటువైపు పడనుంది. అది ఎవరికి మేలు చేకూర్చనుంది అన్న దానిపై రాజకీయ నాయకుల్లోనే కాదు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొందట. వాస్తవానికి జిల్లాలోనే రాజకీయంగా పెద్ద కుటుంబం ఆనం వారిది. వీరి ప్రతీ అగుడు, ప్రతీ మాట, ప్రతీ చర్య రాజకీయమే. దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డికి గంభీరమైన స్వరంతో, వాగ్ధాటితో ఎదుటివారిని ధీటుగా ఎదుర్కొగలడన్న పేరుంది. కానీ మాజీమంత్రి ఆనం రామనారయణరెడ్డి సీరియస్ అయిన సందర్భం ఇంతవరకు రాజకీయాల్లో ఎవరూ చూసుండరు. ప్రతి విషయానికి చిరునవ్వే సమాధానంగా ఉంటుంది. కానీ ఆ చిరు నవ్వులోనే రాజకీయ ఎత్తుగడ ఉంటుందట. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. ఎంత పెద్ద నింద వేసినా కాలమే అన్నింటికి సమాధానం చెపుతుందని చెప్పే వ్యక్తి రామనారాయణ రెడ్డి. మరి వైసీపీ వివక్షతకు గురై ఇంత కాలం ఎందుకు సైలెంట్ గా ఉన్నారని మీడియా ప్రశ్నించగా బడ్టెట్ సమావేశాలు కానివ్వండి అని చెప్పారంటే దాని వెనుక ఏం గూడార్ధం దాగుందో అంటున్నారట జిల్లా నాయకులు. బడ్జెట్ సమావేలశాల అనంతరం రామనారాయణ రెడ్డి ఏం బాంబ్ పేల్చుతారోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారట.

ఇటు మరో తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిది మరో తరహా రాజకీయ స్ట్రాటజీ. రెండు సంవత్సరాల తరువాత జరగబోయే రాజకీయాల్ని ఇప్పుడే ఊహించగలడన్న పేరుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పార్టీని విభేదించి బయటకు వచ్చిన శ్రీధర్ రెడ్డి.. కార్యకర్తలతో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నాడు. టీడీపీ నుండి పోటీ చేయాలని ఆశిస్తున్నానని చెప్పాడు తప్ప.. ఫలానా రోజు మనం కండువా కప్పుకోబోతున్నాం అని ఇంతవరకు పార్టీ క్యాడర్ కు సంకేతాలు ఇవ్వలేదు. దీంతో అటు టీడీపీలో, ఇటు శ్రీధర్ రెడ్డి వెంట నడిచే వారిలో సందిగ్ధత చోటుచేసుకుంది. చూడాలి మరి ఆనం రామనారాయణ రెడ్డి అన్నట్టు.. బడ్జెట్ సమావేశాల తరువాత ఆనంతో పాటు శ్రీధర్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో. అది జిల్లా, రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపబోతుందో.

Tags

Read MoreRead Less
Next Story