Editorial: రెచ్చిపోతున్న మద్యం మాఫియా

Editorial: రెచ్చిపోతున్న మద్యం మాఫియా
కర్నూలు జిల్లాలో చెలరేగిపోతున్న మద్యం మాఫియా; లిక్కర్ మాఫియాకు మంత్రి గుమ్మనూరు అండదండలు; కర్ణాటక టూ ఏపీ దర్జాగా సరఫరా అవుతోన్న మద్యం; అమాత్యుని అడ్డాలో కాసులు కురిపిస్తున్న కర్ణాటక సరుకు; నాసిరకం మద్యం తాగలేక కర్ణాటక సరుకు పై మందు బాబుల ఆసక్తి; మొక్కుబడి తనిఖీలతో మమ అనిపిస్తున్న సెబ్ అధికారులు


అధికార పార్టీ నేతలు దీపం ఉండగానే ఇళ్ళు చక్క బెట్టుకుంటున్నారా? నాసిరకం బ్రాండ్లు తాగలేకపోతున్న మందుబాబుల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారా? ఆంధ్రా కర్ణాటక సరిహద్దుల్లో మద్యం మాఫియా ఆగడాలు మితిమీరాయా? అమాత్యుని అడ్డాలో పొరుగు మద్యం ఎందుకు గుప్పు మంటోంది?.అధికార పార్టీ నేతల కను సన్నల్లో లిక్కర్ మాఫియా రెచ్చిపోతుంటే సెబ్,ఖాకీలు ఏం చేస్తున్నారు? కర్ణాటక టూ ఏపీ కన్నడ సరుకు కథేంటి.

కర్నూలు జిల్లా కర్ణాటక సరిహద్దులో మద్యం మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోతందట. కర్ణాటక మద్యం యథేచ్ఛగా రవాణా అవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని పబ్లిక్ లో జోరుగా చర్చసాగుతోంది. అపుడపుడూ సెబ్ అధికారులకు అరకొరగా మాత్రమే కర్ణాటక మద్యం పట్టుబడుతోందట. అదే సమయంలో లారీల్లో భారీ ఎత్తున కర్ణాటక మద్యం కర్నూలు జిల్లాకు రవాణా అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కర్ణాటక మద్యం రవాణాలో మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇటీవలే కర్ణాటక నుంచి స్కార్పియోలో మద్యం బాక్సులు ఆలూరు శివారులోని మిత్ర వాటర్ ప్లాంట్ వరకు రవాణా చేశారట..ఆ సమయంలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేసి 4,800 టెట్రా పాకెట్లు స్వాధీనం చేసుకోవడంపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే స్కార్పియో వాహనంపై కేసు నమోదు చేయకుండా అధికారులు తప్పించారన్న చర్చ సాగుతోంది. మద్యం అక్రమ రవాణాపై ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో సెబ్ అధికారులను అప్రమత్తం చేశారట. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో దాడులు చేసినట్లు తెలుస్తోంది. అక్రమ మద్యం కేసులో 5 గురిపై కేసు నమోదు చేసినా ముగ్గురు పరారీ అయ్యారట. ఈ కేసులో హత్థి బేలగల్ కు చెందిన వీరాంజనేయులు, మంజు, గోవిందు నిందితులు కాగా ఈ ముగ్గురూ మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులేని విచారణలో తేలిందట.

ఇక ఆలూరు నియోజకవర్గ కేంద్రంగా కర్ణాటక మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోందని చర్చ జరుగుతోంది. మద్యం అక్రమ రవాణాకు కొందరు అధికారులు సహకరిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో లోని కొందరు అధికారులు మద్యం అక్రమ రవాణాకు సహకరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కేవలం నాటుసారా వ్యాపారులపై దాడులు చేస్తూ కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున లారీల్లో మద్యం రవాణా అవుతున్నా వారిపై చర్యలు తీసుకోవడంలేదని సొంత పార్టీ క్యాడర్ లోనే టాక్ వినిపిస్తోంది. కర్ణాటక నుంచి మద్యం రవాణాలో మద్యం మాఫియా తెలివి తేటలకు అధికారులు సైతం విస్తుపోతున్నారట. మద్యం బాక్సులు లారీలో నింపి పైన ఇసుక, కంకర, డస్ట్ వేసుకొని ఆలూరు ప్రాంతానికి చేరవేస్తున్నారట. పెద్ద ఎత్తున కర్ణాటక మద్యం రవాణా అవుతున్నా స్థానిక అధికారులు, పోలీసుల నిఘా కొరవడటంతో మద్యం మాఫియా హద్దులు లేకుండా చెలరేగిపోతోందని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధికారులకు ఫిర్యాదు చేసినా తమ కేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికుల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కర్ణాటక మద్యం అక్రమ రవాణాను అత్యంత పకడ్బందీగా చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ రవాణా సమయంలో ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న వాహనం ముందుగా వెళ్లిన తరువాత వెనుక వచ్చే వాహనాన్ని ఎవరూ ఆపకుండా దానికి సంకేతంగా జాగ్రత్తలు తీసుకున్నారట.

మరోవైపు కర్నూలు అనుకుని ఉన్న తెలంగాణ సరుకూ దర్జాగా సరఫరా అవుతోందట. పేరుకి సెబ్ చెక్ పోస్ట్ ఉన్నా.. మోటార్ బైక్ లు కార్లలో ఒకటి రెండు బాటిళ్లు తో వచ్చే వారిని పట్టుకుని..మమ అనిపిస్తున్నారట.. తెలంగాణ వైపు నుంచి పెద్ద మొత్తంలో వచ్చే మామూళ్లతో కూడిన సరుకు రాష్ట్ర సరిహద్దులు దాటే లెక్కలు వేరే ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story