Editorial: అగమ్యగోచరంగా ఆళ్లనాని రాజకీయ భవితవ్యం

Editorial: అగమ్యగోచరంగా ఆళ్లనాని రాజకీయ భవితవ్యం
2024ఎన్నికల్లో ఆళ్లనాని పోటీపై సందిగ్ధం; ప్రజల్లోనూ నానీ తీరుపై తీవ్ర అసంతృప్తి; నాని వ్యవహారాన్ని తీవ్ర స్థాయిలో ఎండగడుతోన్న తేదేపా

ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాల నేపథ్యంలో అధికార, విపక్షాలకు చెందిన నేతలు రాబోయే ఎన్నికల్లో టికెట్ కన్ఫమ్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఎన్నికల బరిలో గెలుపు కోసం ఇప్పటి నుంచే వైసీపీ, టీడీపీ, జనసేన నేతలు వ్యూహాలు రచిస్తున్నారట. ఏలూరులో ఏ పార్టీ గెలుస్తుందో.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాజకీయ నాయకులు నమ్ముతుంటారు. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఏలూరు సెంటిమెంట్ గా నిలుస్తోంది.

రాజకీయ చైతన్యం కలిగిన ఏలూరు నియోజకవర్గంలో ఇపుడు ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే అన్న చందంగా తయారయ్యిందట పరిస్థితి. ప్రస్తుతం ఏలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల నాని సీఎం జగన్ తో సన్నిహితంగా మెలిగేవారు. 2004 నుంచి పార్టీలో ఉంటూ 2019 ఎన్నికల్లో విజయం సాధించి క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఆరోగ్యశాఖ మంత్రిగా కరోనా టైంలో రెండు చేతులా డబ్బులు కూడ బెట్టుకున్నారని సొంతపార్టీ నేతలే చెవులు కొరుక్కొన్నారట. అయితే రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఆళ్ల నానిని పదవుల నుంచి తొలగించడంతో, అప్పటినుంచి అధిష్ఠానానితో ఆళ్ల నాని అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. అసలు 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా లేదా అన్న చర్చ నియోజకవర్గంలో సాగుతోందట. ఎమ్మెల్యే ఆళ్ళ నానిని జగన్ దూరం పెట్టడం.. నియోజకవర్గ వైసీపీ నేతలు ఆళ్ల నానిని కాదని పార్టీ అధిష్ఠానం దగ్గర పంచాయతీలు పెట్టడంతో నానికి ఈ వ్యవహారాలు తలనొప్పిగా మారాయట. ఇది ఇలా ఉంటే ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్న వివాదాలు ఎమ్మెల్యే ఆళ్ళ నానీ చుట్టూనే తిరుగున్నాయని టాక్ వినిపిస్తోంది. వైసీపీ కి చెందిన రౌడీ షీటర్లు బరితెగించి సామాన్య ప్రజలపై దాడులు, అక్రమాలకు పాల్పడుతున్నా వారికి అడ్డుకట్ట వెయ్యకుండా ప్రోత్సహిస్తున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఇటీవలి ఒక సామాజిక వర్గానికి చెందిన కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే అళ్ల నాని అక్కసు వెళ్లగక్కారట. ఇందులో భాగంగా ప్రజలకు సేవలందిస్తున్న ఫ్లాష్ అనే స్వచ్చంద సంస్థ కార్యక్రమాలను అడ్డుకోవడమే కాకుండా నగరంలోని హిందూ శ్మశాన వాటికలో స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసిన షెడ్ కూల్చివేయడంం పెద్ద దుమారానికి దారితీసింది. దీంతో ఆళ్ల నానికి ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగిందట.. ఇవన్నీ పక్కన పెడితే నియోజవర్గంలో అభివృద్ధి కుంటుపడటం, ఎమ్మెల్యే ఎంతసేపు దొరికినకాడికి దండు కోవడమే పనిగా పెట్టుకున్నారని ...ప్రజల సమస్యలు పట్టించుకునే పాపాన పోలేదని నియోజక వర్గ ప్రజలతో పాటు ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయట.

ఈ నేపథ్యంలో ఆళ్ళ నాని అసమర్థ రాజకీయాలను క్యాష్ చేసుకోవడానికి టీడీపీ నుంచి వలస వచ్చిన నగర మేయర్ షేక్ నూర్జహాన్ ఆమె భర్త ఎస్ఎంఆర్ పెదబాబు మాత్రం కార్పొరేషన్ పరిధిలోని అన్ని వ్యవహారాలు చక్క బెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో దిగి ఎమ్మెల్యే కావాలని స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యే ఆళ్ళ నానిని పార్టీ పెద్దగా పట్టించుకోక పోవడం... నియోజకవర్గంలో ప్రజాదరణ తగ్గడం..మరోవైపు టీడీపీ ప్రజల్లో దూసుకుపోతుండటం లాంటి పరిణామాలతో ... ఆళ్ల నాని రాజకీయ భవితవ్యం అగమ్య గోచరంగా మారిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

ఎమ్మెల్యే ఆళ్ల నాని 2024 లో పోటీ చేస్తారా లేదా అన్న విషయం పక్కన పెడితే..నియోజకవర్గంలో నాని చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగడుతూ టీడీపీ, జనసేన నేతలు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆళ్ల నాని వైఫల్యాలను ఎండగడుతున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బడేటి రాధాకృష్ణ రెండు అడుగులు ముందుకేసి ఇదేం కర్మ మన రాష్ట్రానికి, రచ్చబండ కార్యక్రమాలతో, పాదయాత్రలు చేస్తూ.. నిత్యం ప్రజలతో మమేక మవుతున్నారు. దీనికి తోడు దివంగత నేత బడేటి బుజ్జి 2014లో ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి ఇప్పుడు నియోజకవర్గంలో టీడీపీ గెలుపుకు నాంది పలుకుతుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జనసేన సైతం నియోజకవర్గంలో పోరుబాట పేరుతో పాదయాత్రలు చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఆగడాలను ప్రజలకు వివరిస్తోందట.

Tags

Read MoreRead Less
Next Story