Editorial: కాకానికి "కరెక్టు మొగుడు"..

Editorial: కాకానికి కరెక్టు మొగుడు..
సర్వేపల్లిలో రసవత్తర సమరం; కాకానికి కునుకు లేకుండా చేస్తున్న సోమిరెడ్డి; ప్రభుత్వమంతా ఒకవైపు, సోమిరెడ్డి ఒక్కడే ఒకవైపు; మంత్రి అవినీతి, ఆగడాలపై అలుపెరగని పోరాటం; అక్రమ అధికారులకు సైతం చుక్కలు చూపిస్తున్న సోమిరెడ్డి


నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం, నేదురుమల్లి, బెజవాడ, రేబాల, నల్లపురెడ్డి, సోమిరెడ్లది.. చెరిపినా చెరిగిపోని చరిత్ర. జిల్లా అభివృద్ధితో వీరిని వేరుచేసి చూడలేము. ఒక్కో తరంలో ఒక్కరు జిల్లాలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొందరు నేటికి వారి వారసత్వ రాజకీయాలను కొనసాగిస్తునే ఉన్నారు. అలాంటి వారిలో సొమిరెడ్డి కుటుంబం ఒకటి. నాలుగు దశబ్దాలుగా నెల్లూరు జిల్లా రాజకీయాలతో మమేకమై సాగుతున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నాటి సారాయి ఉద్యమం నుండి నేడు దళితుల పక్షాన పోరాడటం వరకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది ప్రత్యేక స్థానం. అధికారపార్టీపై పోరాడాలి అంటే ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా, రాజకీయంగానైనా, న్యాయపరంగానైనా సోమిరెడ్డికి సోమిరెడ్డే సాటి అంటారు జిల్లా వాసులు. ఒక పోరాటం చేపడితే మధ్యలో విడిచిపెట్టిన ధాఖలాలు లేవు. ఇదే ప్రత్యర్ధుల పాలిట శాపంగా మారుతోంది అంటున్నారు జిల్లాలో అధికార పక్ష నాయకులు, అధికారులు. అయితే ఇప్పుడు సోమిరెడ్డి పోరాటం సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి, సర్వేపల్లిలో జరగుతున్న అవినీతి, అక్రమాల పై సాగుతోందట. సర్వేపల్లి నియోజకవర్గం ప్రక్షాళనకు సోమిరెడ్డి నడుం బిగించాడట. ఇదే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తోందట.

సర్వేపల్లిలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతి, అక్రమాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నాడు సోమిరెడ్డి. నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి జరిగినా ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నాడు. తనది కాకాని గోవర్ధన్ రెడ్డిలా.. నకిలీ పత్రాలతో ఎదుటివారి క్యారెక్టర్ ను దెబ్బతీసే తత్వం కాదంటున్నారు సోమిరెడ్డి. తన ఆరోపణలు వాస్తవం కాదని కాకని నిరూపించగలడా అని ప్రశ్నిస్తున్నాడు. సర్వేపల్లిలోని పోర్టు ట్రాన్సర్ట్ మెదలు, సర్వేపల్లి రిజర్వాయరు, కనుపూరు కాలువ, ప్రభగిరిపట్నం కొండ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉందంటున్నారు సోమిరెడ్డి. ఇలా సర్వేపల్లిలో జరగుతున్న అవినీతిని ప్రశ్నిస్తూ క్యాడర్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాడు. సోమిరెడ్డి పోరాటాలకు వైసీపీ నాయకులు సైతం కాకానిని విడిచిపెట్టి టీడీపీ వైపు ఆకర్షితులు అవుతున్నారట. టీడీపీ వైపు అడుగులేస్తున్న వైసీపీ నాయకులను పోలీసులతో నిలువరించే ప్రయత్నం చేసి విఫలమయ్యాడట కాకాని. అంతేకాదు సర్వేపల్లిలో పోలీసుల దమనకాండకు బలైన ఉదయగిరి నారాయణ కుటుంబానికి అధికార పార్టీ, పోలీసులు, స్థానిక రెవిన్యూ అధికారులు అన్యాయం చేయాలని చూసినా... న్యాయపరంగా జాతీయ స్థాయిలో పొరాడి అండగా నిలవడంతో పొదలకూరు మండలం మెత్తం రెండు చేతులెత్తి సోమిరెడ్డికి దండం పెట్టిందట.

టీడీపీ హయాంలో ముత్తుకూరు ప్రజల కోసం ఏపీ జెన్ కోకి రెండో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ ని తీసుకొచ్చి... దాని డెవల్పమెంట్ చేసి స్థానిక ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాది అవకాశాలు కల్పించారు సోమిరెడ్డి. ఇప్పుడు వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఏపీ జెన్ కోను ముఖ్యమంత్రి ప్రైవేటు పరం చేయడంపై స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కాకాని కనీసం నోరు మెదపలేదు. కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న సోమిరెడ్డి.. అన్ని పార్టీలను ఏకంచేసిన ఉద్యమం ఏడాది పూర్తి చేసుకుంది. అంతేకాదు సర్వేపల్లిలోని ముత్తుకూరు ప్రాంతంలోని దాదాపు పదిహేడు వందల కుటుంబాలకు మత్య్సకారేత ప్యాకేజీ కింద 45 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉన్న.. మంత్రి కాకాని 18,500 కోతవేసి కోట్ల రూపాయలు పంగ నామం పెట్టాడట. దీంతో మత్య్సకారేత ప్యాకేజీ అర్హల తరఫున పోరాటం చేపట్టి కోర్టును ఆశ్రయించారు సోమిరెడ్డి. అవకతవకలకు పాల్పడి రికార్డులను తారుమారు చేసి, పేదల కడుపు కొట్టిన రెవెన్యూ అధికారులపై న్యాయపోరాటం చేశాడు. పొదలకూరు తహసీల్దార్ ను సస్పెండ్ చేయించడంతో పాటు.. వెంకటాచలం తహసీల్దర్ పై లోకాయుక్తలో పోరాటం చేస్తున్నారు. వెంకటాచలం పోలీసుల చేతిలో ఇద్దరు యువకులు అసువులు బాస్తే.. పోలీసుల తీరును ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డారట సోమిరెడ్డి.

వెంకటాచలం మండలం గుడ్లూరువారి పాళెంలో దళితుడి హత్య కేసును నీరు గార్చేందుకు ప్రయత్నించిన సీఐపై న్యాయపోరాటం చేసి.. సస్పెండ్ చేయించేంత వరకు ఊరుకోలేదు సోమిరెడ్డి. అంతేకాదు టీపీ గూడురు మండలంలో మంత్రి ఆదేశాలతో కదం తొక్కిన అధికారులు.... అక్వా రైతుల గుంటలను అటవీ భూముల పేరుతో జేసీబీలు పెట్టి తొక్కించారు. కోలుకోలేని నష్టాన్ని చవిచూసిన బాధితుల పక్షాన న్యాయపోరాటం చేసిన సోమిరెడ్డి... ఫారెస్టు అధికారులతో పాటు స్థానిక రెవిన్యూ అధికారులను కోర్టు బోనులో నిలబెట్టారు. నేడోరేపో నష్టపోయిన అక్వా రైతులకు న్యాయం జరగనున్నట్టు న్యాయవాదులు చెబుతున్నారు. ఇలా సర్వేపల్లిలో ఏ మూలన, ఎవరికి అన్యాయం జరిగినా ఇట్టే వాలిపోతున్నారట సోమిరెడ్డి. అధికార పార్టీ నుండి గానీ, పోలీసుల నుండి గానీ, రెవిన్యూ అధికారులు నుండి గానీ... శాఖ ఏదైనా, అన్యాయం ఏమైనా... బాధితులకు ఒక గోడలా కనిపిస్తున్నారట సోమిరెడ్డి. కష్టం కనిపించినా, నష్టం జరుగుతుందన్నా సోమిరెడ్డి ఇంటి ముంగిట వాలిపోతున్నారు సర్వేపల్లి ప్రజలు. జనం కోసం సోమిరెడ్డి చేస్తున్న పోరాటాలకు ప్రతిఫలంగా పోలీసు కేసులతో సత్కరిస్తోందట ప్రభుత్వం. ఇక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోరాటాన్ని చూస్తున్న సర్వేపల్లి ప్రజలు ఈసారి అఖండ మెజార్టీతొ గెలిపించుకుంటామంటున్నారట.

Tags

Read MoreRead Less
Next Story