EC: ప్రచారానికి నేటితో తెర

EC: ప్రచారానికి నేటితో తెర
సాయంత్రం ఆరు గంటలతో ముగియనున్న ప్రచారం....ప్రలోభాలకు ఆస్కారం ఉన్న చోట ప్రత్యేక నిఘా

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడనుంది. ఐదుపార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు మిగతా రాష్ట్రమంతటా సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనుంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం,డబ్బులు, కానుకలు పంపిణీ జరిగే అవకాశం ఉండటంతో ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. ప్రలోభాలకు ఆస్కారం ఉండేచోట....ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టాలని కలెక్టర్లను సీఈవో వికాస్‌రాజ్‌ ఆదేశించారు. ఈనెల 13న జరిగే పొలింగ్‌ కోసం.... EC ఏర్పాట్లు చేస్తోంది.

తెలంగాణలో సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. ఐతే తీవ్రవాద ప్రాబల్యమున్న ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని..... 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటలకే ప్రచారంముగియనుంది. ఆదిలాబాద్ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ సెగ్మెంట్‌ పరిధిలో.....సాయంత్రం 4 కే ప్రచారం ముగియనుంది. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గపరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి,మంచిర్యాల, మంధని, వరంగల్‌నియోజకవర్గంలోని భూపాలపల్లి, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముంగించాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ప్రచారం ముగియగానే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతుండటంతో... ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. ప్రలోభాలు, హింసాత్మక ఘటనలపై చివరి 72 గంటలు నిఘా పెంచాలని జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ స్పష్టంచేశారు.

ఎన్నికలఅధికారులు, పోలీసులతోపాటు పరిశీలకులు ఆకస్మిక సోదాలు చేపట్టాలని సీఈవో వికాస్‌రాజ్‌ ఆదేశించారు. ముఖ్యంగా డబ్బు, మద్యం పంపిణీ ఎక్కువగా జరిగే బస్తీలు, మురికివాడలపై రాత్రి వేళల్లో తనిఖీలుచేయాలని నిర్దేశించారు. మ్యారేజ్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని తెలిపారు. ఫ్లైయింగ్‌స్క్వాడ్‌లు, చెక్‌పోస్టు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలన్న CEO..సామాజిక మాధ్యమాల్లో వదంతులు, తప్పుడు ప్రచారంపై నిఘాపెట్టాలని ఆదేశించారు. అక్రమ మద్యం, డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మార్గనిర్దేశం . సాయంత్రం 6 నుంచి ఈనెల 13వ తేదీ సాయంత్రం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే సీఈవో వికాస్‌రాజ్‌ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కోసం తుదిఏర్పాట్లలో జాగ్రత్తగా ఉండాలని అధికారులని వికాస్‌రాజ్ ఆదేశించారు. EVMలు వీవీ ప్యాట్‌లు తీసుకెళ్లే వాహనాలపై పకడ్బందీ నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆ వాహనాలకు జీపీఎస్ పెట్టడంతోపాటు భద్రతాసిబ్బంది వెంటఉండాలని స్పష్టం చేశారు. EVM స్ట్రాంగ్‌రూంల నుంచి బయటకు తీసేటప్పుడు.. పోలింగ్ తర్వాత మళ్లీ తీసుకెళ్లేటప్పుడు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలోనే తప్పనిసరిగా వీడియో చిత్రీకరణ చేయాలని స్పష్టంచేశారు స్ట్రాంగ్‌రూంల్లో నిరంతర విద్యుత్ సరఫరా, అగ్నిమాపకచర్యలు చేపట్టాలని ఆదేశించారు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు, సిబ్బంది మొహరింపు ఈసీఐ నిబంధనల మేరకు జరగాలన్న సీఈవో వికాస్‌ రాజ్‌.... పోలింగ్ రోజున ఈవీఎంలలో సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు ECIL ఇంజినీర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్ సభ నియోజకవర్గాల్లో 35 వేల 809 పోలింగ్ కేంద్రాల్లో లక్ష 9 వేల 941 ఈవీఎం యూనిట్లు సిద్ధంచేశారు.

Tags

Next Story