17 Nov 2020 3:22 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఏపీలో ఫిబ్రవరిలో...

ఏపీలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు

ఏపీలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు
X

ఏపీలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాజకీయ పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంది ఎన్నికల కమిషన్‌. పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని.. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలని ఎస్ఈసీ స్పష్టం చేసింది.

ఏపీలో కరోనా ఉధృతి తగ్గిందని.. కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి తగ్గిపోయిందన్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగపరమైన అవసరం అన్న నిమ్మగడ్డ.. తెలంగాణ జీహెచ్‍ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని గుర్తు చేశారు.

ప్రభుత్వం, రాజకీయపక్షాలు, అధికారులంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా.. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకు ఈ ఎన్నికలు ఎంతో అవసరమన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.


Next Story