పంట పొలాలను నాశనం చేసిన ఏనుగులు

శ్రీకాకుళం జిల్లా బామిని మండలం ఘనసర,కీసర ,కోసలి గ్రామాల్లో నాలుగు ఏనుగులు హల్‌చల్ చేస్తున్నాయి.. గత కొద్ది రోజులుగా కొత్తూరు మండలంలోని అనేక గ్రామాలలో ఏనుగులు సంచరిస్తుండడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఏ సమయంలో ఎటు వైపు నుంచి ఏనుగులు తమపై దాడి చేస్తాయోనని హడలిచస్తున్నారు.
అయితే.. ఈరోజు ఘనసర,కీసర,కోసలి గ్రామానికి చెందిన పంట పొలాలలో ఏసుగులు భీభత్సం సృష్టించాయి. మొక్కజొన్న,చెరకు,జీడి మామిడి పంటలను నాశనం చేశాయి. అటవీశాఖ అదికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు. ఏనుగులు తమకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. ఇకనైనా అటవీ అదికారులు స్పందించి ఏనుగులను నుంచి తమ పంట పొలాలను రక్షించాలని రైతులు వేడుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com