సుమారు రెండు వారాలు అవుతున్నా ఏలూరులో అంతుచిక్కని వింత వ్యాధి

దాదాపు రెండు వారాలు అవుతోంది. అయినా ఏలూరులో వింత వ్యాధికి కారణం ఏంటన్నది అంతుచిక్కడం లేదు.. ఊహాగానాలు తప్ప ఏది వాస్తవం అన్నది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. దీంతో ఇప్పటికీ ఏలూరులో భయం గుప్పట్లోనే ఉన్నారు ప్రజలు.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే రైస్‌లో పాదరసం ఉందని NIN పరిశోధనలో తేలింది.
మరోవైపు కూరగాయల్లో పురుగుల మందు అవశేషాలు ఉన్నాయని CCMB కూడా తుది నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే గాలి, నీరు కారణం కాదని తేల్చి ఎయిమ్స్, ఏపీ పీసీబీలు స్పష్టం చేశాయి.. అలాగే వ్యాధి పరిశోధనలపై ఎయిమ్స్ తుది నివేదిక సమర్పించనుంది. వింత వ్యాధి బారిన పడిన బాధితుల శరీరాల్లో లెడ్, నికెల్, ఆర్గానో క్లోరిన్ ఎలా వెళ్లాయన్నదానిపై ఇంకా పరిశోదనలు కొనసాగుతూనే ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com