ఏలూరు ఘటనపై ముగిసిన వైద్య బృందాల సమీక్ష

ఏలూరు ఘటనపై ముగిసిన వైద్య బృందాల సమీక్ష

ఏలూరు ఘటనపై వైద్య బృందాల సమీక్ష ముగిసింది.. అయితే, ప్రజలను ఉర్కిరిబిక్కిరి చేస్తున్న వింత రోగంపై స్పష్టత మాత్రం ఇంకా రాలేదు. బాధితుల రక్త నమూనాల్లో లెడ్‌, నికెల్‌ మోతాదుకు మించి ఉందని కుటుంబ, ఆరోగ్య శాఖ కమిషనర్‌ వెల్లడించారు.. ఎయిమ్స్‌, ఐఐసీటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం నీటిలో ఎలాంటి కాలుష్యం లేదని చెప్పారు. గాలిలో కూడా ఎక్కడా లెడ్‌, నికెల్‌ మోతాదుకు మించి లేదని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు చెప్పింది. అయితే, ధాన్యంలో మాత్రం పాదరసం ఉన్నట్లు అనుమానాలు వచ్చాయని ఆరోగ్య శాఖ కమిషనర్‌ తెలిపారు. ఫిట్స్‌ వచ్చిన వాళ్లలో 80శాతం మంది మాంసాహారం తీసుకోలేదన్నారు. చేపలు, మాంసాహారాలపై ఇంకా పరిశోధన జరుగుతోందన్నారు. ఎలాంటి వైరస్‌, బ్యాక్టీరియా కారణం కాదని.. ఆహారంపై మాత్రమే అనుమానాలు మిగిలాయని అన్నారు. ఫెస్టిసైడ్స్‌, పంటలపై పరిశోధనల ఫలితాలు ఇంకా రావాల్సి ఉందన్నారు. తాగునీటి గురించి ఎలాంటి అపోహలు అక్కర్లేదని కుటుంబ, ఆరోగ్య శాఖ కమిషనర్‌ తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story