మిడిల్ క్లాస్ ఉద్యోగులకు షాక్!

దేశవ్యాప్తంగా పలు కంపెనీలు జాబ్ మేళాను నిర్వహిస్తుంటాయి. వేల సంఖ్యల్లో ఉద్యోగాలు ఉంటే లక్షల్లో నిరుద్యోగులు ఇంటర్వ్యూకు క్యూ కడుతున్నారు. డిగ్రీలు కంప్లీట్ చేసి 100 మంది పాస్ అవుట్ అవుతుంటే 3 నుంచి 5 మందికే జాబ్స్ దొరుకుతున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం జాబ్స్ కోసం ఎగబడే పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు నెలనెలా జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులంతా ప్రమాదంలో ఉన్నారని.. అలాంటి ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయని ప్రముఖ ఇన్వెస్టర్, మెర్సిలస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఫౌండర్, సౌరభ్ ముఖర్జియా వెల్లడించారు.
'బియాండ్ ది పేచెక్: ఇండియాస్ ఎంటర్‌ప్రెన్యూర్ రీబర్త్' అనే పాడ్‌కాస్ట్‌లో సౌరభ్ ముఖర్జియా మాట్లాడుతూ.. భారతదేశం కొత్త ఆర్థిక దశలోకి ప్రవేశించింది. జీతాలపైన జీవించే మధ్యతరగతి వర్గం కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు. మంచి చదువులు చదివి, కష్టపడి పనిచేసేవారికి జీతాలిచ్చే కంపెనీలు తగ్గిపోతాయి. ప్రస్తుతం చాలా కంపెనీలలో ఆటోమిషన్, ఏఐ ద్వారానే పనులు పూర్తి చేస్తున్నారు. దిగ్గజ టెక్ కంపెనీ గూగులే సైతం తన కోడింగ్‌లో మూడో వంతును ఇప్పటికే 'AI'కు అప్పగించింది. రాబోయే రోజుల్లో ఇండియన్ ఐటీ, మీడియా, ఫైనాన్సింగ్ రంగాలు కూడా ఇదే విధానం పాటిస్తాయని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com