వాకింగ్ చేస్తూ ఇంజనీరింగ్ విద్యార్థి..

ఈ మధ్య కాలంలో గుండెపోటు యువకులను పొట్టన పెట్టుకుంటోంది. జిమ్ చేస్తుంటేనో, వాకింగ్ కు వెళితేనో సడెన్ గా మృత్యుముఖంలోకి వెళిపోతున్నారు. వీళ్లంతా 0 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. మారిన జీవనశైలే యువకులను మరణానికి చేరువచేస్తోందా అనే ఆలోచనలు తలెత్తుతున్నాయి.
విజయనగం జిల్లాలో వాకింగ్ కు వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతి చెందడం కుటుంబసభ్యులను తీవ్రంగా కలచి వేసింది. రాజాం మండలం మొగిలివలసకు చెందిన శ్రీహరి (28) శుక్రవారం ఉదయం వాకింగ్ కు వెళ్లాడు. అదే సమయంలో అతడికి గుండె నొప్పిగా అనిపించింది. గుండె పట్టుకుని ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు.
గుర్తించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. శ్రీహరి ఇంజనీరింగ్ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. ఎదిగిన కొడుకు తమను వదిలేసి వెళ్లిపోయాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com