Student suicide: శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ విద్యార్ధి ఆత్మహత్య

ఇంజినీరింగ్ విద్యార్ధి హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళంలో జరిగింది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్ధి ప్రవీణ్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి బుధవారం అర్ధరాత్రి కిందకు దూకాడు. అతను తీవ్రంగా గాయపడటంతో హాస్టల్ సిబ్బంది, సహచర విద్యార్ధులు హుటాహుటిన శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవీణ్ మృతి చెందాడు. మృతుడిని ప్రకాశం జిల్లా వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో విద్యార్థి మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు… ఇంజనీరింగ్ ప్రధమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రవీణ్ నాయక్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తక్షణమే తెలపాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com