పోలవరం నిలిపివేసి రైతులకు నమ్మకద్రోహం చేశారు : చంద్రబాబు

తిరుపతి పార్లమెంటు వైసీపీ ఓటమికి వేదిక కావాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. తిరుపతి నుంచే వైసీపీ వైసీపీ అరచకాలకు అడ్డుకట్ట పడాలన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు.. రాష్ట్రభవిష్యత్తును వైసీపీ అంధకారం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.. అమరావతిని చంపేసి యువత ఉపాధికి గండికొట్టారన్నారు.. పోలవరం నిలిపివేసి రైతులకు నమ్మకద్రోహం చేశారన్నారు. 13 జిల్లాల్లో అభివృద్ధి పనులను నిలిపివేసి ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆపేశారంటూ వైసీపీ తీరుపై మండిపడ్డారు చంద్రబాబు. వాటాల కోసం బెదిరించి పారిశ్రామికవేత్తలను తరిమేశారని ధ్వజమెత్తారు.. ప్రశాంతమైన చిత్తూరు జిల్లాను అరాచకాల మయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com