ఇసుక విధానంలో ఏడాదిన్నరగా గాడిదలు కాశారా? : చంద్రబాబు

ఇసుక విధానంలో ఏడాదిన్నరగా గాడిదలు కాశారా? : చంద్రబాబు
X

వైసీపీ ప్రభుత్వం చేసింది చెప్పుకునే సత్తా లేకే 5 రోజులు టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల తరఫున మాట్లాడే వారిపై దాడులు చేయటం నీచమని ధ్వజమెత్తారు. దశా దిశ లేని దిశ చట్టాన్ని ఆటకెక్కించారని విమర్శించారు. అవగాహన లేని ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలకు దిశ చట్టం ఓ ఉదాహరణ అని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై కథలు చెప్పి... ఆ ఊసే లేకుండా చేశారని అన్నారు. ఇసుక విధానంలో ఏడాదిన్నరగా గాడిదలు కాశారా అని ప్రశ్నించారు.వివిధ పథకాలపై ఎన్నికల ముందు జగన్ మాట్లాడిన వీడియోల్ని చంద్రబాబు ప్రదర్శించారు.

Tags

Next Story