12 Oct 2020 6:13 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఒకే రాష్ట్రం, ఒకే...

ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ నినదించండి : చంద్రబాబు

రాజధానిగా అమరావతి పరిరక్షణకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రైతులకు టీడీపీ శ్రేణులు సంఘీభావం..

ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ నినదించండి : చంద్రబాబు
X

రాజధానిగా అమరావతి పరిరక్షణకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రైతులకు టీడీపీ శ్రేణులు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ నినదించాలని సూచించారు. ఉద్యమంలో 92 మంది రైతులు, రైతు కూలీలు, మహిళళు అమరులయ్యారని అన్నారు. అమరావతి ప్రజా ఉద్యమానికి 300 రోజులు గడిచినా... రైతులకు ఊరట కల్పించే ఒక్క మాటయినా ప్రభుత్వం నుంచి రాలేదని మండిపడ్డారు. పాలకుల అహంకారం ఈ స్థాయిలో ఉండటం దారుణమని చంద్రబాబు ధ్వజమెత్తారు.

  • By kasi
  • 12 Oct 2020 6:13 AM GMT
Next Story