రాష్ట్రంలో జలవనరుల శాఖ పనితీరు నానాటికి దిగజారుతోంది : మాజీ మంత్రి చినరాజప్ప

రాష్ట్రంలో జలవనరుల శాఖ పనితీరు నానాటికి దిగజారుతోందని... మాజీ మంత్రి చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల జీవనాడైన పోలవరం 71 శాతం పనులు పూర్తవడం తెలుగుదేశం ప్రభుత్వ ఘనతేనన్నారు. గత 18 నెలల్లో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎలాంటి కృషి జరగలేదన్నారు. ఇరిగేషన్ శాఖలోని ముఖ్యమైన సర్కిళ్లకు శాశ్వత ప్రాతిపదికన అధికారులను నియమించకపోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతోందన్నారు. అకాల వర్షాలు, తుఫాను వల్ల నష్టపోయిన రైతుల్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు చినరాజప్ప. జలవనరులశాఖపై అవగాహనలేని అనిల్ కుమార్... చంద్రబాబు, లోకేష్‌ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నారని అన్నారు.
Next Story