టీడీపీ-బీజేపీ ఇళ్ల పథకాన్ని వైసీపీదిగా చెప్పుకోవడం సిగ్గుచేటు : అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu
ఏపీలో అరాచక పాలన సాగుతోందన్నారు మజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. ధరలు ఆకాశంలోకి వెళ్లాయని, ప్రజలు దోపిడీకి గురవుతున్నారని అన్నారు..16 లక్షల రేషన్ కార్డులు రద్దు చేశారని అలాగే ఫీజు రీఎంబర్స్‌మెంట్‌నూ ఆపేశారని మండిపడ్డారు. చివరికి పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్లు మూసేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుని నిరసిస్తూ నర్సీపట్నం మున్సిపల్ ఆఫీస్ ముందు టీడీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి.
ఆరు నెలలుగా తనను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు అయ్యన్నపాత్రుడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అందుకే తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. టిడ్కో ఇళ్లకు లోన్లు ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు అయ్యన్న. అప్పులు చేసి లోన్లు కట్టిన వారికి అన్యాయం చెయ్యొద్దన్నారు.. నర్సీపట్నంలో 600 ఇళ్లు జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. టీడీపీ-బీజేపీ ఇళ్ల పథకాన్ని వైసీపీదిగా చెప్పుకోవడం సిగ్గుచేటుని విమర్శించారు అయ్యన్నపాత్రుడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com