Ex-Minister Ayyanna Paturudu Arrest: అయ్యన్న, ఆయన కుమారుడు అరెస్ట్.. లోకేష్ ఫైర్

Ex-Minister Ayyanna Paturudu Arrest: అయ్యన్న, ఆయన కుమారుడు అరెస్ట్.. లోకేష్ ఫైర్
Ex-Minister Ayyanna Paturudu Arrest: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Ex-Minister Ayyannapatrudu arrest: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఐడీ అధికారులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అయ్యన్నపాత్రుడు, రాజేష్‌ అరెస్టులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. అరెస్టులపై పార్టీ నేతలతో చంద్రబాబు హుటాహుటిన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అటు అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతిని చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని, దైర్యంగా ఉండాలని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

పార్టీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్ర పులి అయ్యన్నపాత్రుడుని చూసి.. ప్యాలస్ పిల్లి భయపడిందంటూ కామెంట్ చేశారు. ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకుల దోపిడి, భూకబ్జాలు, దౌర్జన్యాలను బయటపెడుతున్నందుకే బీసీ నేత అయిన అయన్నపాత్రుడుని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. అయినా.. ఒక గోడ కేసులో అర్ధరాత్రి దొంగల్లా చొరబడి, గోడ దూకి మరీ అయన్నపాత్రుడు, రాజేష్‌ని అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. తక్షణమే వారిని విడుదల చేయాలని, అయ్యన్నపాత్రుడు కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులతో వేధిస్తున్న వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు నారా లోకేష్. అయ్యన్న పాత్రుడికి తెలుగుదేశం పార్టీ మొత్తం అండగా ఉందని భరోసా ఇచ్చారు.

పోలీసులంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీ ఉద్యోగులు కాదని ధ్వజమెత్తారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దుస్తులు మార్చుకోవడానికి, చెప్పులు వేసుకోవడానికి అంగీకరించనంత కిరాతకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. జగన్‌ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలతో పోలిస్తే ఎమర్జెన్సీ రోజులే మేలనిపిస్తున్నాయన్నారు సోమిరెడ్డి. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు.. గోడలు దూకడం, అక్రమ అరెస్టులు చేయడం, హింసించడానికి పరిమితం అయ్యారన్నారు.

ప్రభుత్వ అక్రమాల్ని, అరాచకల్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తారా అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. గోడలు దూకింది పోలీసులా లేక వైసీపీ కార్యకర్తలా అని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు కుటుంబంపై జగన్ మోహన్ రెడ్డి ముఠా కక్ష కట్టి వేధిస్తోందని విమర్శించారు. ఉత్తరాంధ్రలో A1, A2 చేస్తున్న భూదోపిడిని, అవినీతిని ప్రశ్నించినందుకు అర్థరాత్రి ఇలాంటి చర్యలకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయ్యన్నపాత్రుడు, రాజేష్‌ అరెస్టుకు వ్యతిరేకంగా.. విజయవాడ గాంధీనగర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద బోండా ఉమ నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి వినతిపత్రం సమర్పించారు. కళ్లకు నల్ల రిబ్బన్‌లు ధరించి, నిరసన తెలిపారు. తక్షణమే అయ్యన్నను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు.

గోడ నిర్మాణం వివాదంలో అయ్యన్నపాత్రుడుని పోలీసులు అరెస్టు చేయటం చట్ట విరుద్ధం అన్నారు యనమల రామకృష్ణుడు. మున్సిపల్ శాఖకు చెందిన సివిల్ అంశంలో సీఐడీ జోక్యం ఏంటని ప్రశ్నించారు. కోర్టులో పరిష్కరించుకునే సివిల్ అంశాలను.. సీఐడీ పోలీసులు తమ పరిధిలోకి తీసుకుని ఎలా అరెస్టులకు దిగుతారని నిలదీశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో వైసీపీ చేసిన ఆక్రమణలను కోర్టు ద్వారా పరిష్కరించుకోలేదా అని ప్రశ్నించారు. అయినా.. అవి ఫోర్జరీ డాక్యుమెంట్లని సీఐడీ దేని ఆధారంగా నిర్ధారణకు వచ్చిందని ప్రశ్నించారు యనమల.

రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందంటూ మండిపడ్డారు టీడీపీ నేతలు ఆలపాటి రాజా, యరపతినేని శ్రీనివాస్. అయ్యన్నపాత్రుడిని అర్ధరాత్రి సమయంలో గోడదూకి ఇంట్లోకి వెళ్లి అరెస్టు చేయడం సీఎం జగన్ శాడిజానికి నిదర్శనం అంటూ మండిపడ్డారు. సీఐడీ పోలీసులు మద్యం తాగి రౌడీల్లా ఇంటిలోకి జొరపడటం, బూతులు తిట్టడం నీచాతినీచం అంటూ విమర్శలు గుప్పించారు. సీఐడి పోలీసులు సీఎం జగన్‌కు ప్రైవేట్ సైనికుల్లా మారారని ఆరోపించారు. బీసీ నేతలపై జగన్ ప్రభుత్వం కక్షగట్టి అణచివేత చర్యలకు పాల్పడుతోందన్నారు ఆలపాటి రాజా, యరపతినేని. రాష్ట్రంలో పెయిడ్ టెర్రరిజం నడుస్తోందని, ప్రజాకోర్టులో దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story