హార్టికల్చర్ పరిశోధన కేంద్రాన్ని కడపకు తరలిస్తున్నా రు : అయ్యన్న పాత్రుడు

హార్టికల్చర్ పరిశోధన కేంద్రాన్ని కడపకు తరలిస్తున్నా రు : అయ్యన్న పాత్రుడు
ఉత్తరాంధ్రపై జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. అనకాపల్లిలో..

ఉత్తరాంధ్రపై జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. అనకాపల్లిలో రైతులకు ఉపయోగపడే హార్టికల్చర్ పరిశోధన కేంద్రాన్ని కడపకు ఎందుకు తరలిస్తున్నారని ఆయన నిలదీశారు. కేంద్రం తరలించడమంటే రైతులకు అన్యాయం చేసినట్లేనని ఆయన అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం... ఈ మూడు జిల్లాలకు కలిపి రైతులకు ఉపయోగపడే విధంగా అనకాపల్లిలో 107 సంవత్సరాల క్రితం వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని స్థాపించినట్లు ఆయన గుర్తు చేశారు. ఇక వైద్య కళాశాల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story