ESI స్కామ్‌లో అసలు సూత్రధారి కార్మిక మంత్రి జయరాం : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు
ESI స్కామ్‌లో అసలు సూత్రధారి కార్మిక మంత్రి జయరాం అని... మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఈ కేసులో A 14గా ఉన్న తెలుకుపల్లి కార్తీక్ జైలు నుంచి విడుదలయ్యాక... మంత్రి కుమారుడు ఈశ్వర్‌కి పుట్టిన రోజున నాడు ఖరీదైన కారు అందించారన్నారు. ఆ ఫోటోలను A 14 తన ఫేస్‌బుక్‌లో పెట్టుకున్న ఫోటోలను అయ్యన్న మీడియాకు చూపించారు. 2019 డిసెంబర్‌లో గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాము మోపుతున్న అభియోగాలపై ఆధారాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. మంత్రి జయరాంని పదవి నుంచి తప్పించాలని అయ్యన్న డిమాండ్ చేశారు. జడ్జితో పూర్తిస్థాయి విచారణ జరపాలన్నారు.
ESI కేసులో అచ్నెన్నాయుడిని.. నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారన్నారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేదించారన్నారు. బీసీలను టార్గెట్ చేసిన అనవసర కేసులు పెడుతున్నారని అన్నారు. తెలుకపల్లి కార్తీక్ ఇచ్చింది పుట్టిన రోజు గిఫ్ట్ కాదు.. ముమ్మాటికి లంచం అన్నారు. మా ఆరోపణలపై సీఎం జగన్ స్పందించాలన్నారు. బీసీలను ఏ ఆధారాల్లేకుండా టచ్ చేస్తూ భూ స్థాపితమవుతావని అయ్యన్న ఘాటుగా హెచ్చరించారు. సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని... ఇందిర లాంటి నాయకలే కనుమరుగయ్యారని ఫైర్ అయ్యారు. ఎక్కడైనా అవినీతి జరిగితే cm జగన్ 14400 కి ఫోన్ చెయమన్నారని అయ్యన్న అన్నారు. అందుకే.. మీడియా సమావేశంలోనే.. ఆ నెంబర్‌కు అయన్న ఫోన్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com