'శిల్పా రవి నోరు అదుపు పెట్టుకో' : మాజీ మంత్రి అఖిలప్రియ

శిల్పా రవి నోరు అదుపు పెట్టుకో : మాజీ మంత్రి అఖిలప్రియ
భూమా కుటుంబంపై చేసిన ఆరోపణలు నిరూపించాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. సలాం కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకుంటే..

భూమా కుటుంబంపై చేసిన ఆరోపణలు నిరూపించాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. సలాం కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకుంటే ఎమ్మెల్యే శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నలుగురు కుటుంబసభ్యులు చనిపోతే 25లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. బంగారం షాపు చోరీ కేసులో వైసీపీ నేతల హస్తం ఉందని ఆమె ఆరోపించారు. హెడ్ కానిస్టేబుల్ గంగాధర్, బంగారం షాపు యజమానిల ఫోన్ కాల్స్ బయటికి తీస్తే అసలు నిజాలు బయటికి వస్తాయన్నారు.

అర్థరాత్రి పూట సలాం ఇంటికి వెళ్లి అసలే బాధలో ఉన్న కుటుంబసభ్యులను మరింత బాధపెట్టేలా పోలీసులు వ్యవహరించడం దారుణమని తెలిపారు. పోలీసుల మీద చర్యలు తీసుకోకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్ లు పెట్టి చేతులు దులుపుకున్నారని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి నోరు అదుపు పెట్టుకోవాలని అఖిలప్రియ హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story