జగన్ విశాఖకు వస్తే ఇంతే సంగతులు: గంటా శ్రీనివాసరావు

జగన్ విశాఖకు వస్తే ఇంతే సంగతులు: గంటా శ్రీనివాసరావు
X

వైసీపీ నేతులు విశాఖ నాలుగు మూలలు ఉన్న విలువైన భూములను కొట్టేశారని అన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు. వైసీపీ నేతల భూ దోపిడీలపై టీడీపీ ఛార్జ్ షీట్ పేరుతో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. స్ధానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట చేపట్టిన భారీ నిరసనలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు..బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్యేలు,టీడీపీ నేతలు పాల్గొన్నారు.

ప్రతిపక్ష నేతగా సేవ్ విశాఖ అంటూ జగన్‌ ఇక్కడే మీటింగ్‌ పెట్టారని ప్రజలందరూ నిజమేనని నమ్మి జగన్ ని గెలిపించారని అన్నారు. అధికారంలోకి వచ్చాక విలువైన భూములు దోచేశారన్నారు. జగన్ విశాఖకు రావడం శుభవార్త కాదని..ప్రజలకు చేదువార్త అన్నారు. ఆయన ఇక్కడకు తరలి రాకముందే ఇలా ఉంటే ఆయన వస్తే ఇంకా అనర్ధాలు జరుగుతాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు గంటా.

Tags

Next Story