అమరావతి ఉద్యమానిదే అంతిమ విజయం : నారా లోకేశ్

అన్నం పెట్టే భూతల్లిని ఏపీ రాజధాని కోసం త్యాగం చేశారు. అమరావతిని చంపేసే కుట్రల్ని నిరసిస్తూ శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారు. తమ త్యాగాల పునాదులపై ఏర్పడిన ప్రజా రాజధానికి సమాధి కట్టొద్దంటూ నినదించారు. అలాంటి రైతులు.. మూడు ముక్కలాటకు మద్దతిచ్చిన బిర్యానీ ఆర్టిస్టులను అడ్డుకోవడమే నేరమా అని ప్రశ్నించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఎస్సీలపైనే జగన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారని ట్విట్టర్లో మండిపడ్డారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి దాన్ని వెనక్కి తీసుకున్నా.. మానవత్వం మరిచిపోయి రైతులను అరెస్ట్ చేయించారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత, బీసీ రైతులకు సంకెళ్లు వేయించడం జగన్‌రెడ్డి శాడిజానికి పరాకాష్ట అన్నారు. రైతులను అరెస్ట్ చేసి జైల్లో వేసిన సమయంలో.. వారికి అండగా ఉంటానంటూ హామీ ఇచ్చానని లోకేష్ తెలిపారు. ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైనా, కొట్టినా, చంపినా.. వెన్ను చూపని అమరావతి ఉద్యమందే అంతిమ విజయం అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com