ఏపీలో ఎస్పీ, కలెక్టర్‌ వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఏపీలో ఎస్పీ, కలెక్టర్‌ వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఏపీలో ఎస్పీ, కలెక్టర్‌ వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

దళితుల శిరోముండనం ఘటనలు రాష్ట్రానికి అవమానకరమని మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అణగారిన వర్గాలకు అండగా ఉండాల్సిన SP, కలెక్టర్‌ వ్యవస్థలు రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయాయని ఆయన ఆరోపించారు. సీఎం స్థాయిలో జగన్ కఠిన చర్యలు తీసుకోలేదు కాబట్టే ఈ తరహా ఘటనలు పెరుగుతున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. భూములు, ఇళ్ల స్థలాల విషయంలో దళితులను రెవెన్యూ అధికారులు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. దళితులకు 20 వేల కోట్లు ఖర్చు పెడితే... ఆ వర్గం శిరోముండనం చేయించుకోవాలా అంటూ ఆయన ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు ఇస్తే అవమానాలు భరించాలా అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.

Tags

Read MoreRead Less
Next Story