నెల్లూరు ప్రభుత్వ స్థలాలపై అధికార పార్టీ నేతల కన్ను

నెల్లూరు ప్రభుత్వ స్థలాలపై అధికార పార్టీ నేతల కన్ను
తాజాగా మహాత్మాగాంధీ నగర్ FCI గోడౌన్ల ఎదురుగా ఉన్న సుమారు 12 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో విలువైన ప్రభుత్వ స్థలాలపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. తాజాగా మహాత్మాగాంధీ నగర్ FCI గోడౌన్ల ఎదురుగా ఉన్న సుమారు 12 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్నట్లు చకాచకా స్థలానికి సంబంధించిన పత్రాల తయారీ జరిగిపోతోంది. చైతన్యపురి వాసుల కోరిక మేరకు గతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా.. ఇక్కడ పార్కు ఏర్పాటుకు సంబంధించి 35 లక్షల రూపాయలను కేటాయించారు.

అందుకు అనుగుణంగా కార్పొరేషన్ అధికారులు కూడా ఏర్పాట్లలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. దీనికి స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు కూడా అండదండలు అందిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. చైతన్యపురి పరిధిలో ఉన్న స్థానికులు మొత్తం ఒక్క తాటిపైకి వచ్చి.. స్థలం అక్రమణను వ్యతిరేకిస్తున్నారు. స్థానిక ప్రజల అవసరాల కోసం పార్కు ఏర్పాటు చేస్తుంటే.. తాము పెద్దిరెడ్డి మనుషులమని.. ఈ స్థలం తమదంటూ అధికార పార్టీ నేతలు కొత్త వాదన తీసుకువస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story