Rajamahendravaram: రాజమహేంద్రవరంలో ప్రకంపనలు రేపుతున్న నకిలీ డాక్టర్ల వ్యవహారం

Rajamahendravaram: రాజమహేంద్రవరంలో నకిలీ డాక్టర్ల వ్యవహారం ప్రకంపనలు రేపుతుంది. నకిలీ డాక్టర్‌పై టీవీ5లో వరుస కథనాలు వచ్చాయి. దీంతో స్పందించిన పోలీసులు నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్న రాజశేఖర్‌ను.. అరెస్ట్ చేసేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు. పక్కా కార్యాచరణ ప్రణాళికతో అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచేందుకు రంగం సిద్ధం చేశారు వన్‌టౌన్ పోలీసులు. ఏ క్షణమైనా అతన్ని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది.
జనతా ఆస్పత్రి కేంద్రంగా నకిలీ డాక్టర్ దందాకు తెరలేపాడు. అర్హత లేకున్నా డాక్టర్ అవతారం ఎత్తాడు. నకిలీ సర్టిఫికేట్లతో వైద్యుడిగా చలామణి అయ్యాడు. ఇదేదికాదు అనర్హమంటూ కార్పొరేట్ హాస్పిటల్స్‌నూ వైద్య దందాకు తెరలేపాడు. ఏకంగా ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్నాడు. ప్రజల ప్రాణాలతో నకిలీ వైద్యులు చెలగాటం ఆడుతున్నారు. ఈజీగా డబ్బు సంపాదించడం కోసం ఎలాంటి విద్యార్హతలు లేకుండా.. ఎంబీబీఎస్ చదవకుండా.. ఎంబీబీఎస్ బోర్డులు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు అటువంటి ఘటన రాజమహేంద్రవరంలో సంచలనం రేపింది.
తప్పుడు వైద్యంతో రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతిచెందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జనతా హాస్పిటల్‌లో కదిలిన తీగ రాజమండ్రి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రాజమహేంద్రవరం దానవాయిపేటలోని సాగర్ హాస్పిటల్ రోడ్‌లో జనతా హాస్పిటల్ ఉంది. అందులో డి. రాజశేఖర్ అనే వ్యక్తి... వైద్యవృత్తికి కావాల్సిన అర్హత లేకున్నా, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్‌గా చలామణి అయ్యాడు. ఈయన విజయవాడకు చెందిన ఓ డాక్టర్ వైద్య పట్టాను ఫోర్జరీ చేసి డాక్టర్ అవతారమెత్తినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ గుట్టును టీవీ5 బయటపెట్టింది.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఫోర్జరీ పట్టాతో రాజమహేంద్రవరంలో నాలుగు సంవత్సరాలుగా నకిలీ డాక్టర్ రాజశేఖర్ వైద్యం చేస్తున్నాడు. పలు కార్పొరేట్ హాస్పిటల్స్‌లోనూ వైద్యుడిగా చలామణి అవుతున్నాడు. అంతేకాదు.. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ కొనసాగుతున్నాడు. మొత్తానికి నకిలీ వైద్య మకిలీపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com