Balakrishna Birthday: గుంటూరులో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు.. 15వేల మందికి అన్నదానం..

X
Balakrishna Birthday: గుంటూరులో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా NTR ఫ్యాన్స్, NRI ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో సుమారు 15వేల మందికి అన్నదానం చేశారు. నందమూరి తారక రామారావు ఆశయ సాధనలో భాగంగా.. రెండు రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమం చేస్తున్నామని బుజ్జి తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మూసేశారని.. ఇప్పుడు వాటిని పునరుద్ధరించి పేద వాళ్లకు పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమం చేపడితే.. ప్రభుత్వం, అధికారులు అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరు మార్చుకోకపోతే రాబోయేరోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
