22 March 2021 3:28 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / గుంటూరు జిల్లా...

గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో రైతులకు తీవ్ర అవమానం

ప్రతిపక్ష నేతల మీద పెట్టే అక్రమ కేసుల మీద ఉన్న శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారంపై లేదని టీడీపీ నేతలు విమర్శించారు.

గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో రైతులకు తీవ్ర అవమానం
X

గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో రైతులకు తీవ్ర అవమానం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పసుపు, మిరప రైతులు దెబ్బతిన్న పంటలపై తమ గోడును కలెక్టర్ వివేక్ యాదవ్ కు విన్నవించుకోవడానికి వెళ్లారు. రైతులతో పాటు మాజీ మంత్రి ఆలపాటి రాజా, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అయితే వారిని కలెక్టర్ దగ్గరికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. కలెక్టర్‌ను కలిసేందుకు అనుమతివ్వకుంటే రోడ్డుపై బైఠాయించి నిరసన చేస్తామని హెచ్చరించారు.. రైతుల ఆందోళనతో దిగివచ్చిన పోలీసులు.. చివరకు కలెక్టర్ ను కలిసేందుకు అనుమతించారు.

అనంతరం కలెక్టర్‌ను కలిసిన రైతులు తమను ఆదుకోవాలంటూ వినతిపత్రం అందజేశారు.. వందల ఎకరాలలో వేసిన పంటలు అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్నాయని.. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కలెక్టర్ ను కోరారు. కలెక్టర్‌తో సమావేశం అనంతరం మీడియా ముందుకు వచ్చిన రైతులు, టీడీపీ నేతలు.. పోలీసుల తీరుపై మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల మీద పెట్టే అక్రమ కేసుల మీద ఉన్న శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారంపై లేదని విమర్శించారు.Next Story