మందడంలో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం

మందడంలో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం

అమరావతిలోని మందడంలో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రైతుల శిబిరంలో మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మను పెట్టేందుకు రైతులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. మూడు రాజధానుల శిబిరంలో ఎన్ని దిష్టిబొమ్మలు కట్టినా పట్టించుకోని పోలీసులు తమ శిబిరంలో ఎలా అడ్డుకుంటారని రైతులతో వాగ్వాదానికి దిగారు. అయినా కానీ రైతులను పక్కకు నెట్టేసి మంత్రి దిష్టిబొమ్మను పోలీసులు తొలగించారు. దీంతో పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.


Tags

Next Story