సలాం కుటుంబానికి సీఎం జగన్ పరామర్శపై ఫారూఖ్‌ సుబ్లీ విమర్శలు

సలాం కుటుంబానికి సీఎం జగన్ పరామర్శపై ఫారూఖ్‌ సుబ్లీ విమర్శలు

సలాం కుటుంబాన్ని సీఎం జగన్ పరామర్శించిన తీరు... భయపెట్టినట్లుగా, ప్రలోభాలకు గురి చేసినట్టుగా ఉందని అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి కన్వీనర్‌ ఫారూఖ్‌ సుబ్లీ విమర్శించారు. అబ్దుల్ సలాం కుటుంబం‌ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించే వరకు పోరాటం ఆగదని స్పష్టంచేశారు. ఒక కుటుంబం అన్యాయంగా చనిపోతే.. ఇదేనా ప్రభుత్వం‌ చేసే న్యాయం అని సుబ్లీ ప్రశ్నించారు. సలాం కుటుంబం మరణానికి కారకులైన వారికి శిక్షలు పడాలని స్పష్టంచేశారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసి కేసును విచారించాలని డిమాండ్‌ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు కాల్ డేటాను బహిర్గతం చేయాలని సుబ్లీ స్పష్టంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story