మాంగారా.. మజాకా.. యానాం అల్లుడికి ఏం పంపారండీ సారె.. ఊరంతా షాక్..

మాంగారా.. మజాకా.. యానాం అల్లుడికి ఏం పంపారండీ సారె.. ఊరంతా షాక్..
ఇల్లు ఖాళీ చేసినా ఇంత సామాను ఉండదేమో.. లారీలో వచ్చిన ఆ సారెని చూసి ఊరంతా నోరెళ్లబెట్టింది. కొత్త అల్లుడికి ఇంత మర్యాద చేసే మాంగారిని మునుపెన్నడూ చూడలేదని ఇరుగు పొరుగు వారు ముచ్చట్లాడుకుంటున్నారు.

ఇల్లు ఖాళీ చేసినా ఇంత సామాను ఉండదేమో.. లారీలో వచ్చిన ఆ సారెని చూసి ఊరంతా నోరెళ్లబెట్టింది. కొత్త అల్లుడికి ఇంత మర్యాద చేసే మాంగారిని మునుపెన్నడూ చూడలేదని స్థానికులు గుసగుసలాడుకున్నారు.

కొత్తగా పెళ్లైన కూతురిని అత్తారింటికి పంపించేటప్పుడు సారె పెట్టి పంపించడం తెలుగింటి ఆనవాయితి. ఎవరి స్థోమతకు తగ్గట్టు అమ్మాయితో పాటు సారెను ఇచ్చి పంపిస్తుంటారు ఆడపిల్ల తల్లిదండ్రులు. కొత్త కోడలు తెచ్చిన సారెను ఊరంతా పంచిపెడుతూ ఆమెను అందరికీ పరిచయం చేస్తుంటారు అత్తింటి వారు.

కానీ గోదావరి జిల్లాల వారు ఈ సారె సంప్రదాయాన్ని తమ ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకుంటారు. అల్లుడికి తమ హోదాను తెలియజేసేందుకు ఇదో మంచి అవకాశంగా తీసుకుంటారు. తాజాగా యానాంలో ఉంటున్న అల్లుడింటికి భారీ ఎత్తున వచ్చిన సారే వార్తల్లో నిలిచి వైరల్‌గా మారింది.

ప్రముఖ వ్యాపార వేత్త తోట రాజ కుమారుడు పవన్ కుమార్‌కు రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషతో ఇటీవల వివాహం జరిగింది. ఆషాఢమాసం రావడంతో మామగారు పంపిన కానుకలు చూసి అల్లుడు అవాక్కయ్యాడు. కొత్త బిందెల్లో స్వీట్లు, పండ్లు, గుడ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ ఒకటేమిటి ఓ చిన్న సైజు మార్కెట్‌నే తరలించారు.

ఊరంతా ఓ వారం రోజులు భోజనం చేయడానికి సరిపడా సామాగ్రిని లారీలో తరలించారు. ఇందులో వెయ్యి కిలోల కూరగాయలు, పాతిక కిలోల కిరాణా సామాగ్రి కూడా ఉన్నాయి. కొత్త అల్లుడికి కొర్ర మీను చేప ఇష్టమని చెప్పిందేమో అమ్మాయి.. అది కూడా పంపించారు మాంగారు. అదృష్టవంతుడివయ్యా అల్లుడూ.. తంతే గారెల బుట్టలో పడ్డావని అతగాడి బంధువులు ఆటపట్టిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story