గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నామినేషన్ల ప్రక్రియ షురూ.. కర్నూలులో అందుబాటులోలేని అధికారులు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. అధికారులు అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రత్తిపాడు మండలంలో స్టేజ్-1 ఆఫీసర్లకు ఓటర్ల జాబితా ఇచ్చి.. నామినేషన్లు తీసుకోవాలని MPDO విజయలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు. ప్రత్తిపాడు, నడింపాలెం, నిమ్మగడ్డవారి పాలెం.. మూడు గ్రామ పంచాయతీలకు స్టేజ్-1 ఆఫీసర్‌గా వి.నాగేశ్వరరావు నియమితులయ్యారు. అభ్యర్థులు వస్తే నామినేషన్లు స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్లలో టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. నామినేషన్ దాఖలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేయకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నామినేషన్ పత్రాలు ఇవ్వడానికి అందుబాటులో లేకపోవడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com