స్వామి వారి రథం దగ్ధం.. అంతర్వేదికి టీడీపీ నిజ నిర్ధారణ బృందం

అంతర్వేదిలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి రథం అగ్నికి ఆహుతి అయిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఘటనను టీడీపీ సీరియస్‌గా తీసుకుంది. టీడీపీ నిజనిర్దారణ కమిటి అంతర్వేదిని సందర్శించనున్నది.నిమ్మకాయల చినరాజప్ప, గొల్లపల్లి సూర్యారావు కమిటీ సభ్యులుగా ఉన్నారు. టీడీపీ నిజనిర్దారణ బృందం అంతర్వేది సందర్శించి నిజానిజాలు విచారించనుంది.
గత 15 నెలలుగా రాష్ట్రంలో ప్రార్ధనా మందిరాలు, దేవాలయాల ప్రాంగణాలలో ఇటువంటి దుశ్చర్యలు విచ్చలవిడిగా పేట్రేగడంపై టీడీపీ మండిపడింది. పిఠాపురంలోని 6దేవాలయాల్లో 23 విగ్రహాలను జనవరిలో ధ్వంసం చేశారని...దీంతోపాటు పలుచోట్ల విధ్వంసానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నిజ నిర్ధారణ బృందం అంతర్వేది సందర్శించి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్దం దుర్ఘటనపై నిజానిజాలు విచారించి టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబుకు నివేదిక అందజేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com