విశాఖలోని ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం

విశాఖలోని ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
పారామౌంట్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ ప్యాకింగ్‌ యూనిట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

విశాఖలోని అగనంపూడి ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారామౌంట్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ ప్యాకింగ్‌ యూనిట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు గుర్తించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫార్మాసిటీ నుంచి వెంటనే నాలుగు అగ్నిమాపక యంత్రాలు వచ్చాయి. చాలా సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అధికారులు ప్రమాదానికి గల కారణాలు అన్వేషిస్తున్నారు. ఈ కంపెనీలో డబ్బాలు, ప్యాకెట్లలోకి నూనెను నింపుతారు. దువ్వాడ సీఐ పి.లక్ష్మి తన సిబ్బందితో కలిసి ఘటన స్థలిని పర్యవేక్షించారు.

Tags

Next Story