Konaseema: శాంతించిన శివకోటి మంటలు

Konaseema: శాంతించిన శివకోటి మంటలు


కోనసీమ జిల్లా శివకోటి గ్రామంలో ఎగిసిపడిన మంటలు ఎట్టకేలకు చల్లారాయి. దాదాపు 8 గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ONGC, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. రాజోలు మండలం శివకోటిలోని బోరుబావిలో ఉదయం 5 గంటల నుంచి ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ONGC బృందం.. మంటలు వ్యాపించిన ప్రాంతాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ONGC గ్యాస్ పైప్‌లైవని తేల్చారు. బోరుబావి 350 అడుగుల లోతుగా ఉండటంతోనే గ్యాస్ లీక్ అయినట్లు గుర్తించారు.

శివకోటి గ్రామంలోని ఆక్వా చెరువు నుంచి గ్యాస్‌ ఉధృతంగా బయటకు వచ్చింది. 20 అడుగుల మేర మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. భూమిలో నుంచి నిరంతరంగా వస్తున్న గ్యాస్‌ మంటలు అదుపు చేయడం కష్టంగా మారింది. అంతకంతకూ మంటలు, గ్యాస్‌ ఎగసిపడటంతో కోనసీమ జిల్లా అంతటా ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

మరోవైపు ఈ అగ్నికీలల వెనుక బోరును మరింత లోతుగా తవ్వడమే కారణమని తెలుస్తోంది. గ్యాస్‌ కోసం గతంలో సెస్మిక్‌ సర్వే జరిగినట్లు సమాచారం. దీనికితోడు ఆక్వా చెరువుల్లో నీటి కోసం అదేచోట ఆరేళ్ల కిందట బోరు వేయగా.. రెండ్రోజుల క్రితం ఈ బోరును మరింత లోతుకు తవ్వారు. దీంతో భూమిలోని గ్యాస్‌ బయటికి వచ్చి మంటలు వచ్చాయని అధికారులు తెలిపారు.

నరసాపురం నుండి ఓఎన్జీసీ అధికారులు నివారణ చర్యలకు పూనుకున్నారు. దానికి సంబంధించిన సామాగ్రిని అక్కడకు చేరవేస్తుండగా, ఒక్కసారిగా మంటలు ఆగిపోయాయి. దీంతో ఓఎన్జీసీ ఆధికారులు సిబ్బంది, బోరుబావిలోకి నీటితో పాటు ఇసుకను పంపింగ్ చేసారు. మంటలు అదుపులోకి రావడంతో స్ధానికులు ఊపిరి పీల్చుకున్నారు. గ్యాస్ ఆయిల్ లీకేజీ ఘటనపై ఓఎన్జీసీ గెయిల్ సంస్థలు పూర్తిస్థాయిలో తనికీలు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని కోనసీమ వాసులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story