AP: అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం

AP: అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం
X

ఆంధ్రప్రదేశ్ లో కాల్పులు కలకలం రేపాయి. వ్యాపారులే లక్ష్యంగా దుండగులు రెచ్చిపోయారు. ఒక్కసారిగా కాల్పులు జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అన్నమయ్య జిల్లాలో ఇద్దరు వ్యాపారులపై గన్ ఫైరింగ్ చేయడం సంచలనం కలిగించింది. పోలీసులు రంగంలోకి దిగి దుండగుల కోసం ఆపరేషన్ చేపట్టారు. రాయచోటి మండలం మాధవరంలో ఇద్దరిపై కాల్పులకు దుండగులు దిగారు. విచక్షణ రహితంగా దాడులకు పాల్పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పాత సామగ్రి వ్యాపారులపై దుండగులు తుపాకీతో గన్ ఫైరింగ్ చేశారు. దుండగుల కాల్పుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమచారం అందండతో సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారి కదలికల కోసం దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాల్పులు జరిపిన ఇద్దరికి ఎవరితోనైనా గొడవలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అసలు దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు. కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటనే దానిపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు జరుపుతున్నారు.

Tags

Next Story