విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో గంగ పుత్రుల దుర్బర జీవనం

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో గంగ పుత్రుల దుర్బర జీవనం

గంగ పుత్రుల జీవితమే ఓ సాహసం. అవును.. నిత్యం సమస్యల కష్టాల సుడిగుండంలో వారి జీవనం కొనసాగుతుంది. ప్రస్తుతం విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో గంగ పుత్రులు దుర్బర జీవనం అనుభవిస్తున్నారు. పాలకులు హామీలు ఇస్తున్నా అవి గాలికేనా అన్నట్టు ఉంది పరిస్థితి. ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పేరిట కేంద్రం 150 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఎందుకు అడ్డొస్తుందంటూ మత్య్సకారులు ప్రశ్నిస్తున్నారు.

ఒకప్పుడు విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో బోట్లు కళకళలాడేవి. సుమారు 800కి పైగా బోట్లపై మత్యకారులు వేటకువెళ్లేవారు. నేడు అందులో సగానికి పైగా బోట్లు కూడా తిరగని పరిస్థితి ఏర్పడింది. చెప్పాలంటే.. ఎన్నో ఏళ్లుగా హార్బర్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. అధికారంలోకి వచ్చిన వైసీపీ మత్స్యకారులకు మంచి చేస్తామని చెప్పింది. కానీ నేటికి డెవలప్‌మెంట్‌ లేదంటూ గంగపుత్రులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. వందల కోట్లు నిధులతో తమకు ఉపయోగపడేవిధంగా హార్బర్‌ను తయారు చేయాలని కోరుతున్నారు. అయితే కొత్తగా నిర్మాణం చేసే భవనాల్ని పోర్ట్‌కి అప్పగించాలని చూస్తే తాము సహించబోమన్నారు. మత్స్యకార భరోసా కూడా కొంతమందికే ఇచ్చారంటూ మండిపడుతున్నారు.

అటు హార్బర్‌లో కొత్త భవనాల నిర్మాణాలపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఏమిటని క్వశ్చన్ చేస్తున్నా యి. స్థానిక ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఆదుకోవాలే కానీ మోసం చేయకూడదన్నారు. మత్స్యకారుల సమస్యల్ని పూర్తిగా గాలికి వదిలేశారంటూ ఫైర్ అవుతున్నారు. ఇటు ప్రభుత్వం కూడా తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గంగపుత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఫిషింగ్ హార్బర్‌కు కొత్త హంగులు రాకపోతే తమ జీవన విధానమే ప్రశ్నార్థకంగా మారు తోందంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story