Vijayawada Flexi : విజయవాడలో హల్‌చల్ చేస్తున్న ఫ్లెక్సీ.. హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్ సార్ అంటూ

Vijayawada Flexi : విజయవాడలో పవన్ కల్యాణ్ అభిమానులు పెట్టిన ఓ ఫ్లెక్సీ హల్‌చల్ చేస్తోంది. హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్ సార్ అంటూ పొగుడుతూ ఫ్లెక్సీ పెట్టారు. దీంతో పాటు మంత్రి కేటీఆర్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫొటోలు కూడా పెట్టారు. విజయవాడ కృష్ణలంకలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఆసక్తి రేపుతోంది.
తెలంగాణలో భీమ్లానాయక్‌కు అన్ని రకాల పర్మిషన్లు ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంటే.. జగన్ ప్రభుత్వం మాత్రం కావాలనే సినిమాపై ఆంక్షలు విధిస్తోందని పవన్ అభిమానులు మండిపడుతున్నారు. బ్లాక్ టికెట్‌కు అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ఐదో ఆటకు అనుమతి ఇచ్చిందని, ఏపీలో మాత్రం పర్మిషన్ ఇవ్వడంలేదంటున్నారు పవన్ అభిమానులు.
జగన్ ప్రభుత్వం పవన్ కల్యాణ్ సినిమాలపై కక్షగట్టిందని ఆరోపిస్తున్నారు పవన్ అభిమానులు. థియేటర్లపై ఆంక్షలు, థియేటర్ యాజమాన్యాలకు వార్నింగ్‌లు, అదనపు షోకి పర్మిషన్ నిరాకరణ.. ఇవన్నీ కక్ష సాధింపు చర్యలేనంటూ ఆరోపిస్తున్నారు. జగన్ మార్క్ ఆంక్షలతో ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వానికి కౌంటర్‌గానే ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారనే ప్రచారం జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com