ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఫ్లెక్సీల కలకలం

X
By - Nagesh Swarna |11 Dec 2020 3:49 PM IST
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఫ్లెక్సీల కలకలం సృష్టిస్తోంది. కొల్లం గంగిరెడ్డి పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీలపై నిషేధం ఉన్నా.. వాటిని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. వైకుంఠపురంలో ఓ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా కొల్లం గంగిరెడ్డి ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫ్లెక్సీల్లో సీఎం జగన్, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి ఫోటోలు కూడా ఉన్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో గంగిరెడ్డిపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com