Srikakulam: ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్.. 100 మంది విద్యార్ధినులు అస్వస్థత

Srikakulam: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ అయింది. సుమారు 100 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. ఫుడ్‌పాయిజన్ విషయాన్ని ట్రిపుల్ ఐటీ కాలేజ్ సిబ్బంది గోప్యంగా ఉంచారు. ఎంతమంది అస్వస్థతకు గురయ్యారో చెప్పడం లేదు.
కాకపోతే, చాలా మంది స్టూడెంట్స్ కడుపు నొప్పితో వాంతులు చేసుకున్నారు. హాస్టల్ మెస్‌లో చపాతీలు తిన్న తరువాత.. ఉన్నట్టుండి కడుపు నొప్పి రావడం మొదలైందని విద్యార్ధినులు చెబుతున్నారు. ఆ తరువాత వాంతులు అయ్యాయని, చాలా మందికి విరోచనాలు అయ్యాయని చెప్పారు.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. క్యాంపస్‌లో ప్రాథమిక వైద్య సేవలు అందించారు. శ్రీకాకుళం ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో సుమారు 3వేల 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఫుడ్ పాయిజన్ అయిన వారిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉందని, వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించామరని చెబుతున్నారు. పుడ్ పాయిజన్‌తో పాటు కలుషిత తాగునీరే దీనికి కారణమని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com