ఏలూరులో 15 చికెన్, మటన్ షాపులు సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

ఏలూరులో 15 చికెన్, మటన్ షాపులు సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
తోకేమో ఫ్రెష్. మేక మాత్రం వరస్ట్.. ఇదేంటి అనుకుంటున్నారా.. ఏలూరులో అంతే. అక్కడ మటన్ షాపుల్లో జరుగుతున్న లీలలు చూస్తే నిన్న, మొన్న తిన్నది కూడా వాంతైపోతుంది.

తోకేమో ఫ్రెష్. మేక మాత్రం వరస్ట్.. ఇదేంటి అనుకుంటున్నారా.. ఏలూరులో అంతే. అక్కడ మటన్ షాపుల్లో జరుగుతున్న లీలలు చూస్తే నిన్న, మొన్న తిన్నది కూడా వాంతైపోతుంది. ఫ్రిజ్‌లో నిల్వచేసిన మాంసాన్ని ఫ్రెష్ అంటూ అమ్మేస్తున్నారు. ప్రతిరోజు నిల్వ చేసిన మాంసాన్ని ఫ్రిజ్‌లలో దాచి మర్నాడు అమ్ముతున్నారు. ఇలా రోజుల తరబడి ఫ్రిజ్‌లో దాన్నే వినియోగదారులకు అంటగడుతున్నారు. కొన్ని దుకాణాల్లో మేక మాంసానికి బదులు గొర్రె మాంసం అమ్ముతున్నారు.

కానీ అది మేకే అని నమ్మించేందుకు మేక తోకను గొర్రె మాంసానికి అంటించి మోసం చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఈ మోసం బయటపడింది. మటన్ షాపులే కాదు చికెన్ షాపుల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. అక్కడ కూడా నాణ్యతాలోపాలు స్పష్టంగా కనిపించాయి. కొన్ని హోటళ్లలోనూ తనిఖీలు చేస్తే సేమ్‌ టు సేమ్‌ సీన్ కనిపించింది. పారిశుద్య పరిస్థితి కూడా ఘోరంగా ఉంది.

ఏలూరును ఇటీవల వింత వ్యాధి వణికించింది. వందలాది మంది ఆస్పత్రి పాలయ్యారు. అందుకు కలుషిత నీరు కారణమా, ఆహారంలో తేడాల వల్లే అలా జరిగిందో ఇప్పటికీ స్పష్టంగా తేలలేదు. ఈ పరిస్థితుల్లో మాంసం దుకాణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాల్లో వెలుగు చూసిన ఘోరాలు అందరినీ షాక్‌కి గురి చేశాయి. ఇలాంటి ఫుడ్డు తింటే రోగాలు కాక ఇంకేం వస్తాయంటూ అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు, ఇవాళ తనిఖీల్లో 15 చికెన్, మటన్ షాపుల్ని ఫుడ్‌ సేఫ్టీ టీమ్‌ సీజ్ చేసింది.



Tags

Read MoreRead Less
Next Story