Kurnool : ఆత్మకూరులోని శివాలయంలో అద్భుతం.. చూడడానికి తరలివస్తున్న భక్తులు..

Kurnool : ఏపీలోని నంద్యాల, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వింత చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో ప్రముఖ శైవ క్షేత్రం ఓంకారంలో అద్భుతం జరిగింది. ఏకాదశి రోజున ఆలయ ప్రాంగణంలో బండపై పాదం గుర్తులు దర్శనమిచ్చాయి. ఈ పాదం గుర్తులను నీళ్లతో ఎంత కడిగినా చెరగకపోవడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ పాద ముద్రలను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
అటు.. పార్వతీపురం మన్యం జిల్లాలో గజ్జల శబ్దాలు కలకలం రేపాయి. పార్వతీపురంలోని ఇప్పలపోలమ్మ గుడి నుంచి గజ్జల శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానికులు తెలిపారు. దీంతో ఆ శబ్దాలు వినేందుకు ఆలయానికి పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఆలయం గోడల వద్ద నిలుచొని శబ్ధాలను వింటున్నారు. రోజూలాగే పూజా కార్యక్రమాల తర్వాత ఆలయ పూజారి గుడి మూసివేసి వెళ్లారు. ఆ తర్వాత శబ్ధాలు వస్తున్నాయని భక్తులు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

