SAIBABA: మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత

SAIBABA: మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత
X
అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస.. నివాళులు అర్పించిన ప్రముఖులు

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మావోయిస్టులతో లింకు ఉందన్న కారణంగా మహారాష్ట్ర పోలీసులు 2014లో సాయిబాబాను అరెస్టు చేశారు. దీంతో ఆయన దాదాపు తొమ్మిదేళ్ళ పాటు జైలులోనే ఉన్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అభియోగాలపై 2014లో మహారాష్ట్ర పోలీసులు సాయిబాబాను అరెస్ట్ చేశారు. సాయిబాబా కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేసింది. 2017లో గడ్చిరోలి కోర్టు నిందితులకు జీవితఖైదు విధించగా.. ఆయన నాగ్‌పూర్‌ జైల్‌లో శిక్ష అనుభవించారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. సాయిబాబాను నిర్ధోషిగా బాంబే హైకోర్టు ప్రకటించింది. మార్చి నెలలో నాగ్‌పూర్‌ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. సాయిబాబా 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన పోలియో కారణంగా ఐదేళ్ల వయస్సు నుంచి వీల్ చైర్‌ను ఉపయోగిస్తున్నారు. ఆయన జైలులో ఉన్న సమయంలో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.

సాయిబాబా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో చాలా ఏళ్లు ఇంగ్లీష్ బోధించారు. ఆయన మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే కేసులో జైలుకు వెళ్లారు. దీంతో ఫిబ్రవరి 2021లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి నుండి తొలగించబడ్డారు.

జైలులో 3588 రోజులు : ఎమ్మెల్సీ లక్ష్మణరావు

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌, రచయిత, విద్యావేత్త సాయిబాబా మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వ అణచివేత విధానాలకు బాధితుడు, ఒక దశాబ్దం పాటు జైలు శిక్ష అనుభవించిన జిఎన్ సాయిబాబా మరణానికి భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) సంతాపం తెలియజేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కొన్నాళ్ల పాటు ఆయనకు బెయిల్ నిరాకరించబడిందని సిపిఎం పేర్కొంది. అటువంటి తీవ్రమైన వైకల్యాలున్న వ్యక్తికి అత్యవసరంగా అవసరమైన వైద్య చికిత్సను సాయిబాబా తిరస్కరించారని తెలిపింది. కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సాయిబాబా మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ”సామాజిక ఉద్యమకారుడు, పౌర హక్కుల ఉద్యమ నాయకుడు, ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ సాయిబాబా మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నాను. పాలకుల విధానాల ఫలితంగా ఆయన జైలులో 3588 రోజులపాటు ఉన్నారు. ఆయనకు బెయిల్ రాకుండా పాలకులు ఎంతో కష్టపడ్డారు. అంగ వైకల్యంతో ప్రొఫెసర్ సాయిబాబా వీల్ చైర్ లోనే తిరిగేవారు. ఆయన మరణం పౌరుహక్కుల ఉద్యమానికి తీవ్ర లోటు” అని తెలుపుతూ ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

Tags

Next Story