Kothapalli Geetha Arrest : మనీలాండరింగ్ కేసులో అరకు మాజీ ఎంపీ అరెస్ట్..

Kothapalli Geetha Arrest : అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా విధించింది సీబీఐ కోర్టు. రుణాల పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో జైలు శిక్ష పడింది. గీత భర్త పి.రామకోటేశ్వరరావుకు ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా విధించింది కోర్టు. బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్‌కు కూడా ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. విశ్వేశ్వర ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటడ్ కు 2 లక్షల జరిమానా విధించింది సీబీఐ కోర్టు.
కొత్తపల్లి గీత సహా నిందితులను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు రాత్రి హైదరాబాద్‌లో నుంచి బెంగళూరుకు తరలించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి 42 కోట్ల 79 లక్షల లోన్ తీసుకుని ఎగవేసినట్లు గీతపై అభియోగాలు ఉన్నాయి. తీసుకున్న డబ్బులను దారి మళ్లించారని సీబీఐ కేసు నమోదు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com